వరి దాన్యం కోనుగోలు చెయ్యాలి - కేసిఆర్

           

                 వరి దాన్యం కొనుగోలు  విషయంలో కేంద్ర ప్రభుత్వం వైకరిని నిరశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపింది. ఇందిరా పార్కు వద్ద జరిగిన మహా దర్నాలో ముఖ్యమంత్రి కేసిఆర్.., మంత్రులు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గోన్నారు. ఉదయం 11గంటల నుండి మద్యహ్నం 2గంటల వరకు దర్నా చేశారు నేతలు అనంతర గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.   

 

                   పండిన పంటను కోనుగోలు చేయ్యమని డిమాండ్ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్.  దేశంలోని రైతులు అనేక విధాలుగా అందోళన చేస్తున్నారన్నారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు విఫలం అవ్వడంతోనే ఈ సమస్య వచ్చింది.  ప్రభుత్వ పెద్ద ఇష్టం వచ్చినట్లు మాట్లడం కాదు..., ప్రణాళికలు రూపోందించి వాటిని అమలు చేయ్యాలన్నారు కేసిఆర్. ప్రపంచంలోని 116దేశాల్లో ఆకలి రాజ్యాల విషయంలో  భారత దేశం 101స్థానంలో ఉంది అన్నారు.  బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉందని ఇది చాలా విచారించ దగ్గ విషయం అన్నారు  కేసిఆర్. జీవ నదులు ఉన్నాయి.. రైతులు ఉన్నారు.. శాస్త్రవేత్తలు ఉన్నారు మరి ఎందుకు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.  తెలంగాణలో వ్యవసాయ అభివౄద్ది కోసం మేం చెరువులు పునరుద్దరీంచాము, ప్రాజెక్టులు కట్టాము పంటలు పండుతున్నాయి. కేంద్రం దానిని కోనాలి. హాంగర్ ఇన్ డెక్స్ లో  దేశం వేనకబడి ఉన్న దేశాన్ని ఆదుకోవాలి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర రైతుల పంటలను కోనుగోలు చేయ్యాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు కేసిఆర్.