వడ్లు కోనాల్సిందే - కాంగ్రెస్ వరిదీక్షా


              తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కోనుగోలు చేయ్యాలంటూ  ఇందిరా పార్కువద్ద  కాంగ్రేస్ పార్టీ వరిదీక్షా నిర్వహించింది. తమ మద్య ఉన్న విబేదాలు పక్కనబెట్టి కాంగ్రేస్ నేతలు అందరూ ఈ రైతు దీక్షలో పాల్గోన్నారు.  రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనాలన్న డిమాండ్‌తో కిసాన్‌ కాంగ్రెస్‌ నేత్రుత్వంలో  ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద   రెండు రోజుల వరి దీక్ష  చెస్తుంది కాంగ్రేస్ పార్టీ. 

డిమాండ్స్:

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజకోనుగోలు చేయ్యాలి..

కోనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

తడిసిన దాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనాలి.

దాన్యం కళ్లాల వద్ద చనిపోయిన వారికి 10లక్షల రూపాయాల నష్టపరిహం ఇవ్వాలి.

మద్దతుధరకు తగ్గకుండా  కోనాలి.

రైతురుణమాఫి లక్ష రూపాయలు ఒకేసారి చేయ్యాలి.

పంటల విషయంలో రైతులపై ఆంక్షలు పెట్టవద్దు.

కల్తీ విత్తనాల నివారణకు సమగ్ర విత్తన చట్టం తెవాలి.

గడిచిన రెండేళ్లుగా ప్రకృతి వైపరిత్యాల వల్ల కలిగిన నష్టాపరిహారన్ని కోర్టు చెప్పినట్లుగా తెలపాలి.

 

                  వరి ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టానికి సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.   వరి వేయవద్దంటూ సీఎం గతంలో చెప్పినా వినకూండా వరి వేసినందునే రైతులపై కేసిఆర్ కక్ష గట్టారని ఆరోపించారు. దాన్యం కోనుగోలు చేయ్యకుండా 45 రోజులు ఆలస్యం చేసి గందరగోళం చేశారని మండిపడ్డారు. రైతులు పండించిన వడ్లు కొనని చేప్పే కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు.  బీజేపీ, కేసీఆర్‌ వేర్వేరు కాదని, ఇద్దరూ తోడుదొంగలేనని ఆరోపించారు.   వడ్లు కొనకపోతే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎ్‌సలను ప్రజలు ఉరితీయడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.  ప్రభుత్వానికి చేతకాకపోతే కాంగ్రెస్‌ పార్టీకి  10 వేల కోట్లు ఇవ్వాలని, వాటితో తాము చివరిగింజ వరకూ వడ్లను కొని చూపిస్తామన్నారు.   క్వింటాలుకు మద్దతు ధర   1960రూపాయలు  ఇవ్వడంతోపాటు అదనంగా మరో 500రూపాయలు బోనస్‌ కూడా ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.