వంట గ్యాస్ బిల్లు - వినియోగదారులకు చిల్లు

 

 

వంట గ్యాస్ సిలిండ్ పై  20 నుంచి  30 రూపాయల వరకు బాధుడు..

హైదరాబాద్ లో రోజుకు  24  లక్షలు  వినియోగదారుల జేబులకు చిల్లు

నెలకు  7.2 కోట్ల రూపాయలు దోపిడి. 

ముక్కు పిండి వసూలు చేస్తున్న డెలివరీ బాయ్స్‌..

మన ఇంటికి  వంటగ్యాస్ సిలిండర్‌ మోసుకొచ్చే బాయ్స్‌ నిర్ణీత   ధరపై అదనంగా వసూలు తప్పని సరైపోయింది. చిల్లర లేక ధరకంటే ఎక్కువ ఇస్తే 20 నుండి 30రూపాయలు తక్కువ ఇస్తుంటారు. ఎంటీ అని అడిగితే అంతే అది మాకు అంటారు. ఎవ్వరైనా గట్టిగా అడితితే ఎంటీ... సార్ అంటూ నోచ్చుకుంటారు.   చేసేది కొంత మొత్తమే అయినా ఇలా ప్రతి ఏటా 86కోట్ల రూపాయలు హైదరాబాదీలు గ్యాస్ అసలు రేటు కంటే అధికంగా చెల్లిస్తున్నారు.  

 

       ఏంటీ ఏకంగా నెలకు 86కోట్లు గ్యాస్ పై అధికంగా చెల్లిస్తున్నామా  అంటూ  ఆశ్చర్యపోకండి ఇది నిజం. గ్యాస్ కు డబ్బులు చెల్లించే ప్రతి ఒక్కరూ ఎదుర్కోనే విషయమే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో మొత్తం 26.80లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని 115గ్యాస్ ఎజేన్సీలు నిర్వహిస్తున్నాయి. ప్రతి రోజు దాదాపు   80 నుండి 90వేల సిలిండర్లు పంపిణి అవుతుంటాయి. ప్రతి సిలిండర్ పై దాదాపు 30రూపాయలు వేస్తే.. 80వేల సిలిండర్లపై  రోజుకు 24లక్షల వరకు వసూలు చేస్తున్నారు డెలీవరి బాయ్స్.. అంటే ప్రతి నెలకు  7కోట్ల 20లక్షల రూపాయలు అవుతుంది.  ఇలా ఎడాదికి 86కోట్ల 40లక్షల రూపాయలు అవుతుంది.  ఈ చర్యలకు కారణం ఎవ్వరూ.. దానిని ఏలా నివారించాలో ప్రభుత్వం ఆలోచించాలి. 


   నిబంధనలేం చెబుతున్నాయి 

             వినియోగదారులు ఆన్‌లైన్‌లో సిలిండర్‌ రీ ఫిల్‌ బుక్‌ చేసుకున్న తర్వాత వచ్చే బిల్లు   ఆధారంగా డిస్ట్రిబ్యూ టర్లు తమ సిబ్బందిచే వినియోగదారులకు రీఫిల్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది.

             గోదాము నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా సిలిండర్‌   డోర్‌ డెలివరీ చేయాలి డిస్ట్రిబ్యూటర్‌ . 6- 15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా చార్జీలకు  10రూపాయలు.. 16-30 కిలో మీటర్ల దూరం ఉంటే  15 రూపాయలు  తీసుకోవాలి.

          ఒకవేళ వినియోగదారుడు గ్యాస్‌ గోదాముకు వెళ్లి సిలిండర్‌ తీసుకుంటే బిల్లులో  8రూపాయలు తగ్గించాల్సి ఉంటుంది డిస్ట్రిబ్యూటర్‌ .
 

            సిలిండర్‌ డోర్‌ డెలివరీ సమయంలో   నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాల్సి ఉంటుంది .
 

 
            గ్యాస్‌ ధర, జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, డోర్‌ డెలివరీ చార్జీలోని రవాణా, హమాలీ, నిర్వహణ  తదితర అంశాలన్నింటిని కలుపుకొని  డిస్ట్రిబ్యూటర్ల లాభంతోనే బిల్ జనరేట్ అవుతుంది.  చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్‌ చేస్తున్న స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు రవాణా భారాన్ని మాత్రం డెలివరీ బాయ్స్‌పై వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.   గ్యాస్  డీలర్లు డెలివరీ బాయ్స్‌కు నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది.  వేతనాలు సరిపడకపోవడంతో బాయ్స్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ సమయంలో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.