లోక్‌సభ ఎన్నికలు 2019
- పశ్చిమ బంగలో ఘర్షణలు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలిదశలో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 3 గంటల వరకూ వివిధ రాష్ట్రాల్లో తొలి దశ ఓటింగ్ శాతాన్ని విడుదల చేసింది.
సంఖ్య |
రాష్ట్రం |
ఓటింగ్ శాతం |
---|---|---|
1 |
పశ్చిమ బెంగాల్ |
69.94 |
2 |
ఉత్తర్ ప్రదేశ్ |
50.86 |
3 |
బిహార్ |
42 |
4 |
మేఘాలయ |
55 |
5 |
నాగాలాండ్ |
68 |
6 |
మిజోరాం |
55.19 |
7 |
ఒడిశా |
57 |
8 |
త్రిపుర |
68.65 |
- నాగపూర్‌లోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఓట్ వేయలేకపోయిన కొందరు
ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో బీఎస్పీ కార్యకర్తలు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్ లోక్‌సభ స్థానంలో చాలా మంది ముస్లిం, దళిత ఓటర్లు ఓటర జాబితాలో తమ పేర్లు కనిపించలేదని ఫిర్యాదు చేశార
ముస్లింలు ఎక్కువగా ఉన్న మాయా కాలనీలో, ముగల్‌పురాలో చాలా మంది పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయని బాగ్‌పత్‌లో ఒక వ్యక్తి చెప్పినట్లు బీబీసీ ప్రతినిధి గీతా పాండే తెలిపారు.
వికలాంగుల కోసం వాలంటీర్లు
- ఈ ఏడాది వికలాంగ ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
- వికలాంగులు, అంధులను తీసుకురావడం, తీసుకువెళ్లడంతోపాటు వాయిస్ మెసేజ్ ద్వారా సూచనలు అందించడానికి ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేసింది.
మండుటెండలో ఓటింగ్
- దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఉన్న ఓటర్లు పొడవాటి వరుసలో తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.
- నాగపూర్‌లో ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని బీబీసీ ప్రతినిధి మయూరేష్ తెలిపారు.
- అసోంలో ఎండ తీవ్రంగా ఉన్నా ఉత్సాహంగా ఓటు వేస్తున్న జనం.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్ శాతం
రాష్ట్రం |
పోలింగ్ శాతం |
---|---|
ఆంధ్రప్రదేశ్ |
41 |
పశ్చిమబెంగాల్ |
55.95 |
అస్సాం |
44.33 |
మేఘాలయ |
44.5 |
సిక్కిం |
39.08 |
మిజోరాం |
46.5 |
నాగాలండ్ |
57 |
ఉత్తరాఖండ్ |
41.27 |
అరుణాచల్ ప్రదేశ్ |
40.95 |
త్రిపుర |
53.17 |
లక్షద్వీప్ |
37.7 |
మణిపూర్ |
53.44 |
ఇప్పటివరకూ రెండు ఓట్లే పడ్డాయి
- ఈ పొటో మా ప్రతినిధి సల్మాన్ రావీ తీశారు. ఇది చత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలోని కిలెపల్ పోలింగ్ కేంద్రం.
BBC
ఈ పోలింగ్ కేంద్రంలో ఇప్పటివరకూ ఇద్దరు మాత్రమే ఓటు వేశారని సల్మాన్ రావి చెప్పారు.
ఈ కేంద్రం ప్రహరీ గోడలపై మావోయిస్టులు ఎన్నికల బహిష్కరించాలని రాశారు.
పశ్చిమ బంగలో ఘర్షణలు
- పశ్చిమ బంగ కుచ్‌బిహార్‌లో ఘర్షణలు జరిగినట్లు సమాచారం.
రాష్ట్రంలో అధికార టీఎంసీ మద్దతుదారులు తమ కార్యకర్తలపై దాడి చేశారని బీజేపీ చెప్పింది. అయితే టీఎంసీ ఈ ఆరోపణలను ఖండించింది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
మోదీ కాదంటే ఇంకెవరు
- ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సవాలు విసురుతున్నారు. రాహుల్ ప్రధాన మంత్రి అయితే ఆయన నెహ్రూ గాంధీ కుటుంబం నాలుగో సభ్యుడు అవుతారు. 2014లో రాహుల్ గాంధీ చేతిలో కాంగ్రెస్ పగ్గాలు లేవు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని లీడ్ చేశారు. ఘోర పరాజయం రుచిచూశారు.
భారత ఎన్నికలకు కేంద్రంగా ఎవరున్నారు
- 68 ఏళ్ల నరేంద్ర మోదీ ఈ సాధారణ ఎన్నికలకు కేంద్రంగా ఉన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌లో పునరేకీకరణ పెరిగిందని చాలా మంది భావిస్తున్నారు. 2014లో బీజేపీ మోదీ నేతృత్వంలో ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. అయితే ఈసారి మోదీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు ఒక్కటయ్యాయి.
ఇప్పటివరకూ ఎంతమంది ఓటర్లు ఓటు వేశారు
- దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. కేవలం ఐదు గంటలే అయ్యింది.
- ఉదయం 11 గంటల వరకూ ఏ రాష్ట్రంలో ఎంత శాతం ఓటింగ్ జరిగిందో పీఐబీ డేటా విడుదల చేసింది.
ఓటు వేసిన పెళ్లికొడుకు
మహారాష్ట్ర వార్ధా నియోజకవర్గంలో పెళ్లిపీటలు ఎక్కే ముందు సంజయ్ సావర్కర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రసూలాబాద్‌లో ఓటు వేసిన సంజయ్ తర్వాత తన పెళ్లి జరిగే హాలుకు వెళ్లారు.
ఈసారీ 39 రోజుల వరకూ ఎన్నికలు
- భారత్‌లో జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం అయ్యాయి. ఇవి మే 19న ఆఖరి దశ పోలింగ్ వరకూ కొనసాగుతాయి. మే 23న కౌంటింగ్ జరగనుంది.
ఈ మొత్తం ప్రక్రియ 39 రోజులు జరగనుంది.
అయితే భారత దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు మాత్రం ఇవి కావు. భారత్‌లో అత్యంత సుదీర్ఘ కాలం జరిగిన ఎన్నికలు మొట్టమొదటి సాధారణ ఎన్నికలే.
- స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951 అక్టోబర్ 25న మొదలై 1952 ఫిబ్రవరి వరకూ జరిగాయి. అంటే ఆ ఎన్నికలు సుమారు 3 నెలలపాటు నిర్వహించారు.
- ఈ ఫొటోను 1952 జనవరిలో కోల్‌కతాలోని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లు ఓటు వేయడానికి తమ వంతు కోసం వరుసలో వేచిచూస్తున్నప్పుడు తీశారు.
1962 నుంచి 1989 మధ్య జరిగిన ఎన్నికలకు నాలుగు నుంచి 10 రోజులు పట్టింది.
1980లో నాలుగు రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకూ అతి తక్కువ కాలం జరిగిన ఎన్నికలు ఇవే.
- బిహార్‌లోని ఔరంగాబాద్‌లో రెండు టిఫిన్ బాంబులు, గయలో ఒక క్యాన్ బాంబు స్వాధీనం చేసుకున్నారు. ఔరంగాబాద్, గయ లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
భారత ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం
- భారత్‌లో భారీగా పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పురుషుల కంటే ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో 65.3 శాతం మంది మహిళలు ఓట్లు వేశారు. అప్పుడు పురుషుల ఓటింగ్ శాతం 67.1
- 2012 నుంచి 2018 మధ్య చాలా రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. మహిళల భాగస్వామ్యం పెరగడం చూసిన రాజకీయ పార్టీలు కూడా వారిని తమవైపు ఆకర్షించేందుకు చాలా పథకాలు కూడా ప్రకటించాయి.
ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్‌లో పోలింగ్ కొనసాగుతోంది.
- ఓటర్లు ఉదయం 6.30 నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర వేచిచూశారు.
ఇక్కడి ఓటర్లలో 20 శాతం మంది ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గాజియాబాద్‌లో మాజీ ఆర్మీ చీఫ్, కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి డాలీ శర్మ, మహాకూటమి నుంచి సురేష్ బన్సల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు.
- తొమ్మిది గంటల వరకూ జమ్ము-కశ్మీర్ బారాముల్లాలో 5.80 శాతం, కుప్వారాలో 7.98, బందీపురాలో 5.97 శాతం ఓటింగ్ జరిగింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కష్టమా, సులభమా
భారత్‌లో మరి కొన్ని వారాల వరకూ కోట్ల మంది ఈవీఎంల ద్వారా ఓటు వేయనున్నారు. భారత్‌లో మొదటిసారి 1982లో దీనిని ఉపయోగించారు.
భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ మెషిన్లను హెలికాప్టర్ల ద్వారా చేరుస్తుంటే, ఇంకొన్ని ప్రాంతాలకు ఒంటెలపై తీసుకెళ్తున్నారు.
ఈ మెషిన్ బ్యాటరీతో నడుస్తుంది. చూడ్డానికి బ్రీఫ్‌కేసులా ఉంటుంది. ఈసారీ చాలా ప్రాంతాల్లో ఓట్లు వేసిన తర్వాత ఒక ప్రింటెడ్ రిసిప్ట్ వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారు.
భారత్‌లో పార్టీలు ఓడిపోతే ఆ దోషం ఈవీఎంలదే అంటారు. అయితే ఎన్నికల కమిషన్ ఈవీఎం ట్యాంపరింగ్ విషయాన్ని కొట్టిపారేసింది.
జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది
- జమ్ముకశ్మీర్‌లో భారీగా మోహరించిన భద్రతాదళాల మధ్య పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ ప్రస్తుతం హంద్వారా జిల్లాలో ఉన్నారు. అక్కడ నియంత్రణ రేఖ దగ్గర ఒక పెద్ద నగరం ఉంది.
ఇక్కడ మిలిటెంట్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారని చెబుతున్నారు.
అయితే రియాజ్ మాత్రం ప్రజలు ఓట్లు వేయడానికి వరుసలో ఉన్నారని చెబుతున్నారు.
- అసోంలో 9.30 వరకు 10 శాతం ఓటింగ్ నమోదైంది.
అసోంలోని తేజ్‌పూర్‌లో ఇప్పటివరకు 10 శాతం, లఖీంపూర్‌లో 10 శాతం, దిబ్రూగఢ్‌లో 10 శాతం, జోర్‌హాట్‌లో 10 శాతం ఓటింగ్ నమోదైంది.
- ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుల కర్తవ్యం అని, అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని అన్నారు. నాగపూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోటీ చేస్తున్నారు.
- ఉత్తరాఖండ్ హలద్వానీలో ఒక పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉన్న ఓటర్లు.
BBC
- ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో ఒక పోలింగ్ కేంద్ర దగ్గర క్యూలో ఉన్న ఓటర్లు. ఇక్కడ మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించారు.
బస్తర్ నుంచి బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావీ ఈ ఫొటోను పంపించారు.
- ఒడిశాలోని కాలాహండీలో ఒక పోలింగ్ కేంద్రం బయట క్యూలో తమ వంతు కోసం వేచిచూస్తున్న ఓటర్లు.
ఈ ఫొటోను బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ్ తీశారు.
గురువారం లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో జరుగుతోంది.
వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కూడా గురువారం నుంచే ప్రారంభం అయ్యింది.
మొదటి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవుల్లోని అన్ని లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఇటు ఇదే దశలో అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ము-కశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బంగలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
మొదటి దశలో కొందరు ప్రస్తుత ముఖ్యమంత్రులు, ఎంతోమంది కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
వీరిలో చౌదరీ అజిత్ సింగ్, జనరల్ వీకే సింగ్, జయంత్ చౌధరి, మహేశ్ శర్మ సహా అగ్ర నేతలు ఉన్నారు.
AFP అజిత్ సింగ్
ఉత్తర ప్రదేశ్
దేశంలోని పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 8 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
ఇక్కడ ముగ్గురు కేంద్ర మంత్రులు జనరల్ వీకే సింగ్(గజియాబాద్), సత్యపాల్ సింగ్(బాగ్‌పత్), మహేశ్ శర్మ(గౌతమ్‌బుద్ధ నగర్)తోపాటు రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కొడుకు జయంత్ చౌధరి కూడా బరిలో ఉన్నారు.
బిహార్
బిహార్‌లో ఔరంగాబాద్, నవాదా, జమూయీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అందరి కళ్లూ జమూయీ స్థానంపైనే ఉన్నాయి.
ఇక్కడ లోక్ జన శక్తి పార్టీ చీఫ్ రామ్‌విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయనపై మహాకూటమి నుంచి భూదేవ్ చౌధరి(రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నుంచి పోటీచేస్తున్నారు.
గయ స్థానం నుంచి బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా(హమ్) చీఫ్ జీతన్ రాం మాంఝీ పోటీ చేస్తున్నారు.
పశ్చిమ బంగ
పశ్చిమ బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాల్లో ఉత్తర బంగలోని కుచ్ బిహార్, అలీపూర్‌ద్వార్ స్థానాల్లో తొలిదశ పోలింగ్ జరుగుతోంది.
ఈ స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు బలమైన పట్టుంది.
అసోం
ఇక్కడ కలియాబోర్, తేజ్‌పూర్, జోర్‌హాట్, దిబ్రూగఢ్, లఖీంపూర్ లోక్‌సభ స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది.
కలియాబోర్‌లో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్, అసాం గణ పరిషత్(ఏజేపీ) మోనీ మాధవ్ మహంత మధ్య గట్టి పోటీ ఉంది.