లాక్ డౌన్ మాత్రమే కాపాడుతుంది

లాక్ డౌన్ మాత్రమే మనల్ని కాపాడుతుంది.

ప్రజలు భాగా సహకరిస్తున్నారు.. ఇంకా సహకరించాలి.

అమెరికా లాంటి దేశాలే తట్టుకునే పరిస్థితి లేదు. 

ఇప్పుడు ఎత్తి వేస్తే ఇంతకాలం పడ్డ శ్రమ వృదా. 

 

                         ఇది మానవ జాతి ఎదుర్కోంటున్న సంక్షోభం. 22దేశాలు 100శాతం లాక్ డౌన్ చేశాయి. కోన్ని దేశాలు ఒక నెల మరికోన్ని దేశాలు 15రోజుల లాక్ డౌన్ చేశాయి. 90దేశాలు పాక్షికంగా లాక్ డౌచేశాయి. ఇన్ని దేశాలు లాక్ డౌన్ చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అందరూ సహకరించాలి.  మన దేశం తీసుకున్న నిర్ణయం మంచిది అందు వల్లే తక్కువ కేసులు  వస్తున్నాయి. లేదంటే చాలా కష్టాలు వచ్చేవి. అమెరికా.. స్పెయిన్ లలో గుట్టలుగుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయి.  అలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే మనం చేస్తున్న పని మంచిది.

 

లాక్ డౌన్ పొడిగించాలి.

                          జూన్ 3వరకు లాక్ డౌన్ ఉంటదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చెప్పింది. వారు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోని చెప్పారు. మన దేశం తీసుకున్న చర్యల కారణంగా మంచి పరిస్థితుల్లో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. హెల్త్ ఇఫ్రాస్ట్రక్చర్ లేదు. మానవాళికి ఎవ్వరికి రావద్దు కాని అలాంటి పరిస్థితి కోన్ని దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉంది.  దాంతో మనకు లాక్ డౌన్ మాత్రమే శరణ్యం అన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. ప్రజలను బ్రతికించుకోవాలంటే ఇలాంటి చర్యలు అవసరం. అయితే ఆదాయంపై ప్రభావం పడుతుంది.  తెలంగాణలో 400కోట్లలకు పైగా ప్రతి రోజు ఆదాయం వస్తుంది. ఎప్రిల్ ఆరవ తేదినాటికి 2400కోట్లు రావాల్సి ఉండగా కేవలం 6కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అయినా పర్వాలేదు.  మనం చావడం కంటే ఆదాయం తక్కువ వచ్చిన మంచిదే కదా అన్నారు ముఖ్యమంత్రి. ఇండియాకు లాక్ డౌన్ ఉండటమే మంచిది అనేది నా అభిప్రాయం అన్నారు కేసిఆర్.  కోన్నింటికి లాక్ డౌన్ ఎత్తి వేయ్యాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కోందరూ. అయితే అందులో ఎలా చేయ్యాలి ఎవ్వరిని వదులాలి అనేది చర్చనీయ అంశం అయ్యింది అన్నారు. దాంతె లాక్ డౌన్ కోసాగించడం మంచిదే అన్నారు.

                            మనవ చరిత్రలోనే ఇలాంటి  సంఘటన లేదు. కాబట్టి ప్రభుత్వ చర్యలను తప్పుపట్టడం సరైంది కాదు. భాగా వైరస్ లోడ్ అయ్యిన వాళ్లు మాత్రం బ్రతకడం లేదు. తక్కువ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వస్తే సమస్య రావడం లేదు. వారు బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రజలు చిన్న చిన్న అనుమానాలు వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ప్రభుత్వం ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని ఈ పనిచేయ్యడం లేదు. దాంతో అందరూ సహకరించాలి. ప్రదాన మంత్రి అడిగితే నేను చెప్పాను అవసరం అయితే  లాక్ డౌన్ పోడగించాలని చెప్పాను. నాగరిక సమాజంలో ఇలాంటి చావులు సరైంది కాదు. కాబట్టి లాక్ డౌన్ పోడగించాల్సిందే.