రోజు కోటి రూపాయలు వడ్డీ చేల్లిస్తున్న జిహెచ్ఎంసి..

రోజు కోటి రూపాయలు వడ్డీ చేల్లిస్తున్న  జిహెచ్ఎంసి..

ఒక‌ప్పుడు కాసుల‌తో గ‌ల గ‌ల‌లాడిన బ‌ల్దియా ఖ‌జానా నేడు వెల వెల‌బోతుంది. అప్పుడున్న ఫిక్స్ డ్ డిపాట్లు క‌రిగిపోయాయి....., మ‌రో వైపు ప‌న్నులు వ‌సూళ్లు మంద‌గించాయి. ఇంకో వైపు  ప్ర‌భుత్వం ఆదుకోదు.... కాని రోజుకో కోత్త ప్రాజెక్టును  అమ‌లు చేయ్యాలంటూ బ‌ల్దియాపై బారం పెంచుతుంది స‌ర్కార్.  దీంతో ఒవైపు జీతాలు... మ‌రో వైపు మెయింటెనేన్స్ ను వెళ్ల దీయ‌డం కూడా క‌ష్టంగా మారింది జిమెచ్ఎంసికి. ఒక‌టో తారికు వ‌చ్చిందంటే చాలు.... మ‌న జీతాలు ప‌స్ట్ కు వ‌స్తాయా  లేదా అనే అంశంపై ఉద్యోగుల్లో ఆందోల‌న మొద‌లౌతుంది. ఇక ఫైనాన్స్ విభాగం అధికారులు మాత్రం ఎ బిల్లు ఆపాలి.... ఎ బిల్లు విడుద‌ల చేయ్యాలి అంటూ ఒక‌టికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటున్నారు. మూడు నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు 600కోట్లరూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు ఇటివల జరిగిన బల్దియా బడ్జెట్ సమావేశంలో కమీషనర్ ప్రకటించారు. ఇంకా ఫైనల్ కాని   బిల్లులు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది. 

 

                 బ‌ల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. స‌మ‌గ్ర రోడ్డు డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టుల‌కు..., కాంప్రహెన్సీల్ రోడ్డు మెయింటెనేన్స్..., లింక్ రోడ్లు...., చెరువు అభివృద్ది...,  పేరుతో జిహెచ్ఎంసి చెపట్టిన ప్రాజెక్టులకు  ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు. నగరంలో జిహెచ్ఎంసి చెపట్టిన అన్ని ప్రాజెక్టులకు  బల్దియానే అప్పులు చేసింది. గడిచిన నాలుగైదేళ్లుగా 4595 కోట్ల రూపాయలు అప్పులు చేసింది జిహెచ్ఎంసి. ఇందులో స్టేట్ బ్యాంకు అప్ ఇండియా నుండి మూడు 3,960కోట్ల రూపాయలు..., బాండ్స్ విక్రయించడం ద్వారా  495 కోట్ల రూపాయలు...,  హడ్కో  ద్వారా 140కోట్ల రూపాయలు అప్పలు చేసింది జిహెచ్ఎంసి. వీటికి వడ్డి సరాసరిగా 9శాతం చెల్లిస్తున్నారు. ప్రతి నెల 30 కోట్ల రూపాయల వడ్డి చెల్లిస్తున్నది జిహెచ్ఎంసి. అంటే ప్రతి రోజు కోటి రూపాయల వడ్డి చేల్లిస్తుంది జిహెచ్ఎంసి. మిగతా అప్పులు చేయ్యకుండా వీటిని మాత్రమే చెల్లించినా దాదాపు 9200  కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది జిహెచ్ఎంసి. 

          పరిస్థితి ఇలానే ఉంటే జిహెచ్ఎంసి అప్పుల ఊబిలో కూరుకుపోవడం కాయంగా కనిపిస్తుంది. ఇప్పటికైన ప్రభుత్వం ఈ అంశంలపై ఫోకస్ చేయ్యాలి. ప్రభుత్వం నుండి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు నిదులు మంజూరు చేయ్యాలి.