రైతన్న నీకు సలాం...

      ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసిన ఘనత అన్నదాతదేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. భారీ జనాభా ఉన్న భారతదేశం ఆకలి తీర్చుతున్నది రైతన్నలేనని కొనియాడారు. దేశ రక్షణంలో మన వీరజవాన్లు ప్రాణాలకు తెగించి శౌర్య పరాక్రమాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి సోమవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ రైతులు, జవాన్లకు సలాం చేశారు.