రెండు నెలలు ఉచిత ఆహారధాన్యాలు: కేంద్రం

   కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఆహారధాన్యాలు ఉచితంగా అందించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మే, జూన్ నెలల్లో ఐదు కిలోల బియ్యం, ఇతర సరుకులను దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. దీని కోసం రూ. 26వేల కోట్లను ఖర్చుచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది.