రాజ్యాంగ నిర్మాతకు నివాళి

                   భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా జిహెచ్ఎంసి కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ....భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔనత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహనీయులని అన్నారు.  బలహీన వర్గాల అభ్యున్నతికి ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. అసమానత లేని సమాజ స్థాపనకు యెనలేని కృషి చేశారన్నారు. అంబేడ్కర్ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవలన్నారు.