రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి

భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని సంవిదాన్ దివాస్ పురస్కరించుకోని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ...దేశ భవిష్యత్తును రూపొందించడంలో పీఠిక (preamble) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్నిసంవిధాన్ దివాస్ గా జాతీయ న్యాయ దినోత్సవం గా ప్రతిఏటా జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, దేశాన్ని ఒకేతాటిపై నడిపించే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దాని ఫలాలను ప్రతిఒక్కరూ ఆస్వాదించాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరులుగా ఎదుగాలన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక జీవనప్రమాణాలు పెంపొందించడానికి దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో పొందుపర్చారని తెలిపారు.

ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజిని, డైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్, సిపిఆర్ఓ ముర్తుజా, సిబ్బంది పాల్గొన్నారు.