యూనివర్సిటీల కొత్త వీసీలు వీల్లే....

  రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించారు. వీసీల నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం వర్సిటీల వారీగా జీవోలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీగా డీ రవీందర్‌, అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి కే సీతారామారావు, శాతవాహన వర్సిటీ వీసీగా ఎస్‌ మల్లేశం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా సీహెచ్‌ గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, తెలంగాణ యూనివర్సిటీకి ఉపకులపతిగా డాక్టర్‌ డీ రవీందర్‌గుప్తా, జేఎన్‌ఏఎఫ్‌యూ వీసీగా కవిత దర్యాని, కాకతీయకు తాటికొండ రమేశ్‌, తెలుగు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా కిషన్‌రావు, జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. వీసీలు మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.