మోడల్ మార్కెట్ల మోక్షం ఎప్పుడు

అదునాతన మంటూ హంగామా చేశారు. మోడల్ అంటూ  కోట్ల రూపాయలు ఖర్చు చేశారు... తీరా వాటిని మూలకు  వేశారు. నగరంలో మార్కెట్ల కష్టాలు తగ్గించాలంటూ నిర్మించిన మోడల్ మార్కెట్లు ఎందుకు  పనికిరాకుండా పోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మార్కెట్లలో అందుబాటులోకి వచ్చినవి అంతంత మాత్రమే. హైదరాబాద్ నగరంలో 1000 మార్కెట్లు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన ఆదేశాన్ని బల్దియా అధికారులు గాలీకి వదిలేశారు....


                  2016 సంవత్సరంలో  సికింద్రాబాద్ మోండామార్కెట్ ను సడెన్  ఇన్పెక్షన్ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ హైదరాబాద్ లోని మార్కెట్లను మెరుగు  పరుచాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో మార్కెట్లు చాలా తక్కువగా ఉన్నాయని ప్రతి పది వేల మందికి ఒక మార్కెట్ ఉండేలా ప్లాన్ చేయ్యాలని సూచించారు. అంతే కాకుండా మోండా మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌ను బుట్ట‌దాఖ‌లు చేసిన బ‌ల్దియా అధికారులు.  అయితేగ్రేటర్ పరిదిలో  ఉన్న మార్కెట్ల తీరులో మాత్రం ఎలాంటి మార్పురాలేదు.  అయితే అప్పట్లో ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన బల్దియా యాంత్రాంగం హైదరాబాద్ లో 200మార్కెట్లను యుద్ద ప్రాతిపదికగా నిర్మించాలని......., అందుకోసం 300కోట్లు ఖర్చు అవుతుందని డిసైడ్ చేసింది.  రెండు లేదా మూడు అంత‌స్తుల‌లో అతిత‌క్కువ స్థ‌లంలో అన్ని స‌దుపాయాల‌తో కూడిన మోడ‌ల్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకరాం చుట్టిన అదికారులు మొద‌టి విడ‌త‌లో 165మార్కెట్ల నిర్మాణానికి టెండ‌ర్ల‌ు పిలిచారు.  వీటిలో 119  మార్కెట్ల నిర్మాణానికి టెండ‌ర్లు ఖ‌రారు చేశామ‌ని చెప్పినా..... వీటిలో 40 మార్కెట్ల నిర్మాణం చెప‌ట్టారు.     ముఖ్యమంత్రి ప్రకటించి  5 సంవత్సరాలు గడుస్తున్నా  మార్కెట్లు అందుబాటులోకి రాలేదు.  దాంతో  చాలా  ప్రాంతాల్లో   రోడ్ల‌పైనే వ్యాపారాలు చేస్తున్నారు  చిరువ్యాపారులు.   

 

                 ఇక 35 వ‌ర‌కు మార్కెట్లు పూర్తి అయ్యాయి అంటున్నా వాటి కేటాయింపు మాత్రం అంతంతే..  మరో మూడు పురోగతిలో ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇందులో ఆయా ప్రాంతాలను బట్టి 10 నుండి 19 వరకు షాపులు ఉన్నాయి. మొత్తం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మోడల్ మార్కెట్లు నిర్మాణం చేశారు.  ఈ మార్కెట్లలో శాఖాహార, మాంసాహార పదార్థాలకు విడివిడిగా దుకాణాలను కేటాయించడంతోపాటు వినియోగదారుల సౌకర్యంకోసం పార్కింగ్...., టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను కూరగాయలు, తినుబండారాలు, ఫార్మసీ, ఏటీఎంలు, టాయ్‌లెట్లకు కేటాయించారు. మొదటి అంతస్తును మాంసం దుకాణాలు, గ్రోసరీ, డ్రైఫ్రూట్స్, పప్పు దినుసుల వంటి దుకాణాలకు కేటాయించాలని డిసైడ్ చేశారు అదికారులు. ఇక కొత్తగా నిర్మించిన మార్కెట్లలో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా షాపులను నిర్మించారు. ఒక‌టి అర మిన‌హిస్తే పూర్త‌యిన మోడ‌ల్ మార్కెట్లు కూడా ఇదిగో ఇలా ఖాళీగా ద‌ర్శ‌మిస్తున్నాయి.  ఎన్నిసార్లు వేలం వేసినా ఇక్క‌డ వ్యాపారాలు చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదంటున్నాయి బల్దియా వర్గాలు. అయితే ఇవి కోన్ని ప్రాంతాల్లో రోడ్డుకు దూరంగా ఉండటం... మరికోన్ని బస్తీలు కాలనీలకు దూరంగా ఉండటంతో వాటికి ఆదరణ తక్కువైంది.

 

             కూకట్‌పల్లి జోన్ లో  9 మార్కెట్లు ప్రతిపాధించగా 8 మార్కెట్లు పూర్తి కాగా ఒక్క షాపు  కూడా కేటాయించలేదు. ఎల్‌బీనగర్‌ జోన్ పరిదిలో 11మోడల్ మార్కెట్లు ప్రతిపాధించగా 10 మార్కెట్లు పూర్తికాగా 3 మార్కెట్లలో కోన్ని షాపులు కేటాయింపు చేశారు. ఇక ఖైరతాబాద్‌ జోన్ పరిదిలో మూడు మార్కెట్లు ప్రతిపాధించగా అన్ని పూర్తికాగా ఒక్క మార్కెట్ లో కేటాయింపులు చేశారు.  చార్మినార్‌ జోన్ పరిదిలో 6 మార్కెట్లు ప్రతిపాదిస్తే అన్ని పూర్తి అవ్వగా.. ఒక్క మార్కెట్లో షాపులు కేటాయింపులు చేశారు. ఇక శేరిలింగం పల్లి జోన్ పరిదిలో 12మార్కెట్లు ప్రతిపాదించగా 5మార్కెట్ల నిర్మాణం పూర్తి కాగా ఒక్క మార్కెట్లో షాపులు కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు అధికారులు. సికింద్రాబాద్ జోన్ పరిదిలో3 మార్కెట్లు ప్రాతిపదించగా మొత్తం పూర్తి అయినా ఒక్కమార్కెట్లోనూ కేటాయింపులు లేవు. ఇలా మొత్తం 45 మార్కెట్లు ప్రతిపాదిస్తే.., 34మార్కెట్లు పూర్తి కాగా అందులో 6మార్కెట్లో ఉన్న కోన్నిషాపులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఇలా అనేక ప్రాంతాల్లో ఎర్పాటు చేసిన మోడల్ మార్కెట్లు  నిర్మించిన అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మోడల్ మార్కెట్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి. ఇప్పటికైనా అధికారులు మార్కెట్లపై ఫోకస్ చేయ్యాలని కోరుతున్నారు సిటిజన్స్.