మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగరా

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగార మోగింది. రెండు రష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీఅయిన స్థానాలకు ఈ ఎన్నికల్లో  ఎన్నుకోనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ 3 స్థానాలకు, తెలంగాణలో 6ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  అయితే 9వ తేదినా ఎమ్మెల్సీ  నోటిఫికేష్ వెలువడుతుంది. నవంబర్ 16వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదిన నామినేషన్ల పరిశీలన.. 22వ తేదినా ఉపసంహరణ ఉంటాయి. ఇక 29వ తేదినా ఉదయం 9గంటల నుండి సాయంత్ర 4గంటల వరకు  పోలింగ్ ఉండగా.. సాయంత్ర కౌంటింగ్ చేసి ఫలితాలు వెళ్లడిస్తారు అధికారులు.