మెట్రో ఆర్థిక కష్టాలకు అదేకారణమా...

రియాలిటిపై ఫోకస్ చేయ్యని హైాదరాబాద్ మెట్రో..

మెట్రో ఆర్థిక కష్టాలకు అదేకారణమా...

                      హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు.. కరోనా సృష్టించిన కష్టం నుండి గట్టెక్కించాలని..., ఆర్థిక సహకారం అందించి అదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. కేవలం 50 శాతం ఆదాయం మాత్రమే తగ్గడం ద్వారా మెట్రోకు అంత భారీ నష్టం వచ్చిందా..., రియాలిటి ఆదాయంపై మెట్రో ఎందుకు ఫొోకస్ చేయ్యలేదు... ప్రకటనల ఆదాయం ఎందుకు రావడం లేదు అన్న అంశం ఇప్పుడు చర్చనీయ అంశం అయ్యింది. హైదరాబాద్ లో కమర్షియల్ స్పెస్ కు చాలా డిమాండ్ ఉందన్న రిపోర్టు ఒకవైపు వస్తుంటే ఎల్ అండ్ టి అధికారులు వందల ఎకరాల స్థలం  ఎందుకు ఖాళీగా ఉంచారు. ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్న అంశం.

 

 

                    హైదరాబాద్ మెట్రో రైల్..., ఇప్పుడు సగటు హైదరాబాద్ ప్రయాణికుడి ప్రయాణ వేగాన్ని పెంచిన సాధనం. కరోనాకు ముందు ప్రతి రోజు దాదాపు 4.5లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చెర్చింది.  కరోనాతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. మెల్లమెల్లగా పరిస్థితిలో మార్పు వస్తుందని..., ప్రయాణికులు పెరగుతున్నారని ఎల్ అండ్ టి మెట్రో అధికారులు చెబుతున్నా చాలా స్టేషన్లు కేవలం ఒకవైపు మాత్రమే తెరిచి ఉండటం చూస్తూంటే రద్దీ పూర్వ స్థితికి రాలేదని అర్థం అవుతుంది. దాంతో తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విన్నవించింది ఎల్ అండ్ టి మెట్రో రైల్ సంస్థ. దీర్ఘకాలం అవకాశం ఉన్న సాఫ్ట్ లోన్ ఇవ్వాలంటూ కోరింది.  ఇంతవరకు భాగానే ఉన్న హైదరాబాద్ మెట్రో సేవల్లో ఎల్ అండ్ టి సంస్థలకు టికెట్ అమ్మకం ద్వారా కేవలం 50శాతం మాత్రమే ఆదాయం వస్తుందని ఒప్పందం సమయంలోనే నిర్ణయించారు. మిగిలిని ఆదాయంలో 45శాతం ఎల్ అండ్ టి కి కేటాయించిన భూముల్లో మాల్స్ నిర్మించి వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా.., మరో 5శాతం మెట్రో స్టేషన్లు..., రైల్లలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా రాబట్టలని డిసైడ్ చేశారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తారని అంచానా వేశారు. అది సాద్యం కాలేదు. కరోనా మరింతగా మెట్రో ప్రయాణికులపై ప్రభావం చూపించింది. నాలుగున్నర లక్షలు ఉన్న ప్రయాణికులు సగానికి పడిపోయారు. కరోనాకంటే ముందుకూడా నష్టాల్లో నడుస్తుందని ప్రకటించారు మెట్రో అధికారులు. ఎల్ అండ్ టి తీసుకున్న అప్పులకు వడ్డికూడా  పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో  382 కోట్ల నష్టం వచ్చిందని....,  2020-21 లో కరోనా కారణంగా 916 కోట్లు మొత్తంగా 1766 కోట్ల ఆ ఏడాది నష్టం వచ్చినట్లు చెప్పుకోచ్చాయి మెట్రో వర్గాలు. దీంతో తమకు ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసింది.

 

                    అయితే హైదారబాద్ మెట్రో కు మరో ప్రాదాన ఆదాయవనరు రియాలిటి నుండి వచ్చేంది.  పబ్లీక్ ప్రయివేట్ పాట్నర్షిఫ్ మోడల్లో చెపట్టిన ప్రాజెక్టుల్లో  ప్రపంచంలోనే హైదరాబాద్ మెట్రో పెద్దది. దాంతో ఆర్థికంగా వయోబుల్ కాదని నగరంలో ప్రదాన ప్రాంతాల్లో  దాదాపు 269 ఎకరాల్లో భూమిని కేటాయించింది ప్రభుత్వం. దీనిని రవాణ ఆదారిత అభివృద్ది అంటారు.  అందులో కమర్షియల్ నిర్మాణాలు చేసి వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా 45 శాతం నిధులు  రాబట్టుకునే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం కేటాయించిన   ఈ స్థలంలో  మియాపూర్..., నాగోల్ ప్రాంతాల్లో మెట్రో డిపోలు పోను మొత్తం ఆదాయంకోసం ఉపయోగించుకోవచ్చు.  మొత్తం  180 లక్షల చదరపు అడుగుల పరిదిలో నిర్మాణాలు చేసి వాటిని 60ఎళ్లపాటు లీజుకు ఇవ్వడం ద్వారా ప్రతి యేటా ఆదాయం పోందవచ్చు ఎల్ అండ్ టి మెట్రో సంస్థ. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చనేది ఒప్పందం. కాని ఇప్పటికి ఎల్ అండ్ టి 18 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్సెష్ ను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెబుతుంది.  అంటే లక్ష్యంలో 10శాతం మాత్రమే రీచ్ అయ్యింది. మెట్రో అందుబాటులోకి వచ్చేనాటికి 60లక్షల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణం అందుబాటులోకి తెస్తామని అప్పట్లో మెట్రో వర్గాలు చెప్పుకోచ్చాయి.  దాంతో ఇక్కడి నుండి రావాల్సిన ఆదాయంపై ప్రబావం పడిండంటున్నారు నిపుణులు.  ఇక మిగిలిన 5శాతం ఆధాయం మెట్రో పిల్లర్లు..., స్టేషన్లు..., రైళ్లలో వాణిజ్య యాడ్స్ ఇవ్వడం ద్వారా రాబట్టుకోవాలని  ఎల్ అండ్ టి హైదారబాద్ మెట్రో యాజమాన్యం. అప్పుడు అది  100శాతం ఆదాయం అవుతుంది. అయితే ఇప్పుడు మాత్రం టికెట్ ఆదాయం తగ్గిందని..., తాము నష్టపోయామంటూ ప్రభుత్వానికి చెప్పడం ఎంటనేది నిపుణుల ప్రశ్న. ఒకవేల భారీ మొత్తంలో లాభాలు వస్తే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించేదా అనే ప్రశ్న లేవనేత్తుతున్నారు. అసలు ఒప్పందం అమలు చేయ్యడంలో నిర్మాణ సంస్థ..,  దానిని అమలు చేయించడం లో ప్రభుత్వం విఫలం అవుతున్నాయంటున్నారు. ఒప్పందం ప్రకారం కాకుండా టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచడం వల్లే మెట్రోకు అంచనా వేసినంత రద్దీ రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ప్రభుత్వం వేసిన ఉన్నత స్థాయి కమీటిలో సైతం ప్రభుత్వం కేటాయించిన భూములను మెట్రో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తుంది.