మాట జారితే...,

 

             మాట జారితే తిరిగి తీసుకోలేమంటారు పెద్దలు. అంతే కాదు దాని పర్యావసనం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కూడా. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది చైనా బిలియనీర్ జాక్ మా కు. ప్రముఖ  ఈ-కామార్స్ దిగ్గడం అలీబాబా వ్యవస్థాపకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన వ్యాపారం.., ఆదాయంపై ప్రభావం చూపాయి. 

 

                   2020 అక్టోబర్ 24న చైనాలో జరిగిన ది బండ్ సమ్మిట్ లో జాక్ మా మాట్లాడుతూ చైనా ఆర్థిక వ్యవస్థ.., బ్యాంకింగ్ లో ఉన్న లోపాలపై మాట్లాడారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని విడనాడాలని సూచించారు. అయితే అది ఇప్పుడు శాపం అయ్యిందంటున్నారు విశ్లేషకులు.  ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకుల నిర్ణయాలతో  వ్యాపారంలో భారీగా నష్టం వచ్చింది.  దాంతో  జాక్ మా  ఆస్థి అవిరి అయ్యింది.  

                మొత్తం 344 బిలియన్ డాలర్ల ఆస్తి కనుమరుగైంది. మన రూయాల్లో అయితే 25లక్షల కోట్లు. ఎడాదిలో ఇంత భారీగానష్టపోయిన సంస్థలు ప్రపంచంలో ఇదే మొదటిది అయి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. ప్రతి రోజు 7వేల కోట్ల వరకు జాక్ మా కు చెందిన అలీబాబా సంస్థ తన సంపదనను కోల్పోయారు.