మరో 32 బస్తీ దవాఖానలు

             ప్రజా ఆరోగ్యం కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక శ్రద్ద పెట్టింది. నగరంలోని బస్తీ  ప్రాంతాల్లో నివసించే   ప్రజల ఆరోగ్యం సురక్షితం చేయాలనే సంకల్పంతో ఇప్పటి వరకు 226 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది.  వాటిల్లో ప్రతి రోజు ఒక్కో కేంద్రానికి 70 నుండి వంద మంది వరకు పబ్లీక్ వస్తున్నారు. డాక్టర్ సలహాలు ఉచితంగా అందడమే  కాకుండా మందులు అవసరం అయిన వైద్య పరిక్షలు కూడా ఉచితంగా అందుతున్నాయి. దాంతో నగరంలోని మరో 32 ప్రాంతాల్లో త్వరలో   బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నారు అధికారులు అందుకోసం ఎర్పాట్లు పూర్తి చేస్తున్నారు.   త్వరలో వీటిని ప్రారంభించే చర్యలు చేపట్టారు. కాలనీ పరిధిలో గల కమ్యూనిటీ హాల్స్ ఇతర ప్రభుత్వ భవనాల్లో బస్తీ ధవఖానలు ఏర్పాటు చేస్తున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో  మొత్తం 300 వరకు బస్తీ దవాఖాన ఏర్పాటు చేయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం.