మరోసారి ఉమ్మడి రాష్ట్రంగా మార్చే కుట్ర...మంత్రి తలసాని

    తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..  తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ప్రధాని మోదీ పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని విమర్శించారు. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.