మంచి మనసుతో ఒక్కటయ్యారు

  • ఆదర్శ వివాహం చేసుకున్న జంట

 

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో మారువని ఘట్టం.సరైన జోడి కోసం నేటి యువత పరితపిస్తున్నరు. కానీ వివాహ
అన్యున్నతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సిద్దిపేట్ కు చెందిన విద్య సాగర్ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. చిన్నతనం నుండే అనాధగా పెరిగిన విద్య సాగర్ వివాహ సంబందంతో కుటుంబాన్ని పొందలనుకున్నాడు. అందులో భాగంగా సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతి కుటుంబం నుండి వివాహ సంబంధం వచ్చింది . అయితే ఆ యువతి మరగుజ్జు అయినప్పటికీ విద్య సాగర్ వివాహానికి ఒప్పుకున్నాడు. ఆమెకు జీవితాన్ని ఇవ్వడంతో పాటు తనకు ఓ కుటుంబం అండగా ఉంటుందని ఆలోచించాడు. సికింద్రాబాద్ కు చెందిన రవళి ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది . అంగవైకల్యం ఉన్నప్పటికీ వివాహానికి ఒప్పుకోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వారికి వివాహం జరిపించారు . ఈ వివాహ వేడుకకు ముషీరాబాద్  వేదిక అయ్యింది . గొప్ప మనస్సుతో ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులను వివాహానికి హాజరైన వాళ్ళు అభినందించారు.