భూముల అక్రమణ నిజమే - కలెక్టర్

                ఈటెల రాజేందర్ కు చెందిన జమునా హేచరీస్ భూముల్లో అసైన్డ్  భూములు ఉన్నట్లు తెలిపారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని  అసైన్డ్ భూముల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సంబంధించిన జమున హేచరీస్‌ యాజమాన్యం   ఆక్రమణలకు పాల్పడిందని వివరించారు. ఈ గ్రామాల్లో 56 మందికి చెందిన 70.30 ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జాకు గురైనట్లు తమ సర్వేలో గుర్తించామన్నారు.  అచ్చంపేటలోని సర్వే నంబర్లు 77 నుంచి 81, 130 అలాగే హకీంపేటలోని 97, 111 సర్వే నంబర్లలో నిర్వహించిన సర్వేలో 70.30 ఎకరాల అసైన్డ్‌ భూములు ఆక్రమణకు గురైనట్లు సర్వేలో తేలిందని  మీడియాకు వివరాలు వెల్లడించారు కలెక్టర్. జమున హేచరీస్‌ యజమానులు జమున, నితిన్‌ రెడ్డి నాలా కన్వర్షన్‌ లేకుండానే అసైన్డ్‌ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారని కలెక్టర్‌ వివరించారు.

 

        ఇక అనుమతులు లేకుండా ఇక్కడ పౌలీట్రి ఫాంలు, షెడ్లు, రోడ్ల నిర్మాణం చేసినట్లు అధికారులు గుర్తించారు. నిషేదిత జాబితాలో ఉన్న భూములను  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు తెలిపారు.