బొప్పాయి పండు గురించి తెలుసు మరి బొప్పాయి ఆకు గురించి మీకు తెలుసా?


బొప్పాయి పండు తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయనే విషయం తెలుసు. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఈ పండు వలన అందుతాయి. బొప్పాయి పండులో ఉండే లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. బొప్పాయి పండే కాకుండా బొప్పాయి ఆకు వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

 
బొప్పాయి ఆకుల్లో యాంటీ-మలేరియా లక్షణాలు ఉన్నాయి. వీటిలోని యాక్టోజెనిన్‌ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది.

కాలేయాన్ని శుభ్రం చేయడంలో క్లీనింగ్‌ ఏజెంటుగా పనిచేస్తుంది.

లివర్‌ సిరోసిస్‌, ఇతర కాలేయ జబ్బుల్ని నివారించే లక్షణాలు బొప్పాయి ఆకుల్లో ఉంటాయి.

ఈ ఆకులతో చేసిన జ్యూస్‌ను కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుంది.

బొప్పాయి ఆకుల్లోని యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగులోని, పొట్టలోని మంటను తగ్గిస్తాయి. బొప్పాయి ఆకుల జ్యూసు పెప్టిక్‌ అల్సర్లను కూడా తగ్గిస్తుంది.

బొప్పాయి ఆకుల్లో విటమిన్‌-సి, విటమిన్‌-ఎ లు పుష్కలంగా ఉండుట వలన కంటి సమస్యలను తగ్గిస్తుంది.

 
బొప్పాయి ఆకుల పేస్ట్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతాయి. నేచురల్‌ కండిషనర్‌గా పనిచేస్తూ జుట్టును కాంతివంతంగా,మృదువుగా చేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఆకులు చాలా మంచి చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్దీకరణ చేస్తాయి .

బొప్పాయి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్ కిడ్నీ దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఫ్యాటీ లివర్‌ సమస్యను నివారించడంలో సహాయపడతాయి.

బొప్పాయి ఆకుల్లో పపైన్‌, కైమోపపైన్‌లాంటి ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల బొప్పాయి ఆకులతో చేసిన జ్యూసు తాగితే శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. అందుకే డెంగ్యూ వ్యాధి వచ్చిన వారికీ బొప్పాయి ఆకు జ్యూస్ ని ఇస్తూ ఉంటారు.