ప్రపంచంలో మరోసారి పేరుగుతున్న కొవిడ్

ప్రపంచంలో మరోసారి పేరుగుతున్న కొవిడ్ 

చైనాలో విమానాల రద్దు.. స్కూల్స్ కు సెలవులు..

రష్యాలో ఆఫిసులు బంద్..

పలు దేశాల్లో పేరుగుతున్న కేసులు..

            ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పేరుతున్నాయి. ప్రదానంగా యూరప్ మరియు  ఆసియా దేశాల్లో పేరుగుతున్న కేసులు ఇప్పుడు ప్రపంచ ప్రజానికాన్ని కలువర పెడుతున్నాయి. బ్రిటన్ లో కోత్తగా ప్రతి రోజుదాదాపు 50వేల కేసులు వస్తున్నాయి.  రష్యాలో ఈ సంఖ్య  35వేలు దాటింది. దాంతో అక్కడ కఠిన నిబంధనలు అమలు చేయ్యాలంటూ దేశ అద్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. కోన్ని ప్రాంతాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయ్యాలని నిర్ణయించారు. పక్కనే ఉన్న మరికోన్ని దేశాల్లో అదే పరిస్థితి నెలకోంది. బ్రిటన్ ప్రతి రోజు 50వేలకు పైగా కేసులు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక చైనాలోకేసుల సంఖ్య పేరుగుతుంది. కేసులను పూర్తి స్థాయిలో నిరోదించాలని నిర్ణయించిన చైనా గవర్నమెంట్ ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకుంటుంది. కేసులు వచ్చిన ప్రాంతాల్లో స్కూల్స్.. టూరిజం ప్లేసులను మూసివేస్తుంది.