ప్రజా ఆరోగ్యమే ముఖ్యం

  • హైదరాబాద్ హోటళ్లపై బల్దియా దాడులు
  • నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా

హైదరాబాద్ నగరంలో హోటళ్ల ల పై దాడులు కొనసాగిస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. శానిటేషన్ నిర్వహణ.. భుజించడానికి వీలులేని పదార్థాల నిల్వచేయడంపై సీరియస్ గా వ్యవహరిస్తుంది. ట్రేడ్ లైసెన్సులు తీసుకోకపోవడం, నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగించడంపై అధికారులు ఫైన్ లు వేస్తున్నారు అంతేకాకుండా హోటళ్లలో  ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు నేరుగా మురుగు కాలువ లోకి వదలడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తుంది జిహెచ్ఎంసి. చందానగర్ సర్కిల్ పరిధిలో వివిధ హోటళ్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి సిటిజెన్స్ అనారోగ్యానికి కారణమయ్యే వారిపై భారీగా పెనాల్టీలు  విధించారు. వారం రోజులలోగా ఆయా వ్యాపార సంస్థలు తమ లోటుపాట్లను సరిచేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు వ్యాపారులకు సూచించారు. కమిషనర్ ఆదేశాలతో ఈతనిఖీలు చేపడుతున్నామాన్న  యదగిరి రావు వ్యాపారుల తీరు మారకుంటే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

పెనాల్టీలు విధించిన వ్యాపార సంస్థలు:

1. నేహా రెస్టారెంట్ - 1,00,000 

2. రోహిత్ వైన్స్ - 50,000

3. తవక్కల్ రెస్టారెంట్ - 30,000

4. హోటల్ సంక్రాంత్రి - 50,000

5. సాయి తేజ వైన్స్ - 25,000