పోలింగ్ విదులంటే భయపడుతున్న సిబ్బంది.

 

            పోలింగ్ విదులంటే భయపడుతున్న సిబ్బంది.

            ట్రైనింగ్ కు భారీగా డుమ్మకోట్టిన అధికారులు..

            ఒటింగ్ సమయంలో కరోనా అంటుతుందని అనుమానం..

            హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్ అధికారులు భయపడుతున్నారా...., కరోనా కేసులు వస్తున్న నేపథ్యం జిల్లాల నుండి హైదరాబాద్ సిటికి వచ్చేందుకు జంకుతున్నారా..., అంటే అవుననే అనిపిస్తుంది. గ్రేటర్ సిటి ఎన్నికల కోసం ఇచ్చే శిక్షణకు హాజరు కావాలంటూ జిహెచ్ఎంసి జారీ చేసిన ఉత్తర్వులను  బేఖాతరు చేసి.. ట్రైనింగ్ కు డుమ్మాకోట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కోసం జరుగుతున్న ఎన్నికల విదుల్లో పాల్గోనేందుకు వివిధ విభాగాలకు చెందిన అధికారులు హాజరు కావాలంటూ ఎన్నికల కమీషన్ నుండి ఉత్తర్వులు వెళ్లాయి. దాంతో ఆయా జిల్లాలకు చెందిన ఉద్యోగులు 45వేల మందిని సేకరించి వారికి ఎన్నికల శిక్షణ ఇచ్చి ఒటింగ్ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలిని నిర్ణయించింది జిహెచ్ఎంసి.

 

                      డిసెంబర్ ఒకటిన జరిగే ఎన్నికల నిర్వహణకు పీ.ఓ మరియు ఏ.పీ.ఓ లుగా నియమితులైన  21 వేల మంది సిబ్బందికి ఎర్పాటు చేశారు. నగరంలో వివిద చోట్ల  30 కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్ణయించారు.  ఈ శిక్షణకు హాజరు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ ఇప్పటికే రెండు రోజుల క్రితమే అందరూ అధికారులకు సమాచారం అందించారు అధికారులు. వీరికీ శిక్షణ నిచ్చేందుకై 166 మాస్టర్ ట్రైనీలను సిద్దం చేసింది. నేడు ఉదయం 11 గంటలనుండి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి 4 గంటల వరకు 30ప్రాంతాల్లో   శిక్షణ ఇచ్చారు ట్రైనర్లు.  అయితే గ్రేటర్ ఎన్నికల్లో విదులు నిర్వహించేందుకు చాలా మంది అధికారులు జంకుతున్నట్లు తెలిసింది. అందుకు తగ్గట్లుగా 30 నుండి 35శాంత మంది శిక్షణకు గౌర్హాజరు అయ్యారు. అంటే దాదాపు 21వేలల్లో 7వేల మంది ఈ రోజు శిక్షణకు హాజరు కాలేదు. దాంతో బల్దియా అధికారులు ఒక్కసారిగా కంగుతున్నారు. ఇంత మంది విధులకు హాజరు కాకపోవడంపై ఆరాతీశారు. సిటిలో ఉన్న కరోనా భయమే జిల్లాలనుండి ఎన్నికల డ్యూటికి రాకుండా చేసిందని తెలిసింది. ఇలా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఎన్నికల విదులకు హాజరు కాకుంటే ఒటింగ్ నిర్వహించడం కష్టమని భావించిన జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి లోకేస్ కుమార్ గైర్హాజరు అయిన ఉద్యోగులకు షోకాజ్ నోటిసులు అందించాలని ఆదేశించారు. 

 

                          ఈ రోజు  హాజ‌రుకాని   ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల‌కు  మ‌రో అవ‌కాశంగా   25వ తేదీన మ‌రోసారి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు ఎన్నిక‌ల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్. ఎన్నిక‌ల శిక్ష‌ణ‌కు హాజ‌రుకానివారు, తమకు కేటాయించిన శిక్షణ కేంద్రంలో 25వ తేదీన త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌ని అన్నారు. ఎన్నిక‌ల విధుల నుండి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి వ‌స్తున్నార‌ని, ఎట్టిప‌రిస్థితులోనూ మిన‌హాయింపు కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు కమీషనర్ లోకేష్ కుమార్. ఎన్నిక‌ల విధుల‌కు హాజ‌రుకానివారిపై చట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు జిహెచ్ఎంసి ఎన్నిక‌ల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ హెచ్చరించారు.