పేపర్ లో ప్యాక్ చేసిన పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుంది

  • న్యూస్ పేపర్లలో తిను పదార్థాలను ప్యాక్ చేయవద్దు
  • వాటిని తింటే కేన్సర్ వస్తుంది
  • జులై1 నుంచి న్యూస్ పేపర్లు.. రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారయ్యే క్యారీబ్యాగుల నిషేధం

 

అలా బజారుకు వెళ్లి ఇలా తినుబండారాలు తెచ్చుకుంటున్నారా....? వేడివేడి దోశలు పూరీలు న్యూస్ పేపర్ లో మూట కట్టి ఇంటికి తెచ్చుకుంటున్నారా...? వాటిని మీ కుటుంబంతో కలిసి ఆరగించేస్తున్నారా....? అయితే ఇకపై అలా చేయకండి. మీ ఆరోగ్యమైన బాడీని క్యాన్సర్ అటాక్ చేయవచ్చు. న్యూస్ పేపర్లు రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారు చేసిన క్యారీ బ్యాగులలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాయాన్సర్ వస్తుందని... అందువల్ల వాటినిి వినియోగించ రాదని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఆదేశించింది. పత్రికల తయారీకి వాడే ఇంక్ లు... డైల వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని అందువల్ల వాటిని వినియోగించవద్దని తెలిపింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తగిన సమయంం ఇచ్చి జూలై నుంచి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.