పీపుల్ పర్సెప్షన్ సర్వే-2022లో పాల్గోనండి - మేయర్

పీపుల్ పర్సెప్షన్ సర్వే-2022 లో హైదరాబాద్ ను ముందంజలో ఉంచాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి



           హైదరాబాద్    నగరంలో ఈజీ అప్ లివింగ్ కోసం పీపుల్స్ పర్సెప్షన్ సర్వే 2022 లో పాల్గొని హైదరాబాద్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలను కోరారు .


హైదరాబాద్ నగర నివాసితులకు జిహెచ్ఎంసి అందిస్తున్న మౌలిక సదుపాయాల సేవల పై  కేంద్ర పట్టణ, హౌసింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 10 లక్షల పైగా జనాభా ఉన్న పట్టణాల నుండి  నవంబర్ 9వ  తేదీ నుండి డిసెంబర్  23వ వరకు నిర్వహించే ఈజీ ఆఫ్ లీవింగ్  కోసం చేపట్టే  పీపుల్స్ పర్సెప్షన్ సర్వే-2022 నిర్వహిస్తున్న  నేపథ్యంలో నగర నివాసితులు మన హైదరాబాద్ నగరాన్ని అగ్రగామిగా ఉండే విధంగా సర్వేలో అధిక సంఖ్యలో  పాల్గొని తమ అభిప్రాయాలను  వ్యక్త పరచాలని  మేయర్  తెలిపారు.

           కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలో  ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశం పై ప్రజల నుండి ప్రభుత్వం  అందిస్తున్న సేవల పై  సర్వే సేకరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో  ఈజ్ ఆఫ్  లీవింగ్  కోసం చేపట్టే పీపుల్స్ పర్సెప్షన్ సర్వే లో   నగరాల లో ఇంటి అద్దె,  విద్య, వైద్యం, ప్రజా రవాణా తో పాటు రిక్రియేషన్ అంశాల గురించి  17 ప్రశ్నల పై తమ అభిప్రాయాన్ని తెలియ జేయాలని అన్నారు.

ఈ సర్వేలో  పాల్గొనే వారు https//eol/2022.org గానీ  క్యూ ఆర్ కోడ్  వినియోగించుకొని  తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక  చేసిన తర్వాత  హైదరాబాద్ నగర  ulb code 800935  కూడా  ఎంపిక చేయాలని   కోరారు.
నిర్దేశించిన  17 ప్రశ్నల పై మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే  దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా నిలిచి అవార్డు పొందుతుందని  మేయర్  తెలిపారు.