పన్ను చెల్లించండి   2 శాతం ఫెనాల్టీ మినహాయింపు పోందండి..

                 ఆస్తిపన్ను సకాలంలో చెల్లించి   2 శాతం ఫెనాల్టీ నుండి  మినహాయింపు పొందండి

 

              ఆస్తి పన్ను సకాలంలో చెల్లించని పక్షంలో ప్రతి నెల 2 శాతం పెనాల్టీతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసి పరిధిలో ఒక ఆర్థిక సంవత్సరంలో  రెండు సార్లు పన్ను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. మొదటి ఆరు నెలలకోసారి,  రెండవ అరు నెల ల పన్ను  చెల్లించాల్సి ఉంటుంది   మొదటి ఆరు నెలల అనగా ఏప్రిల్, మే, జూన్ జూలై ఆగస్టు, సెప్టెంబర్  మాసాలలో మొదటి మూడు నెలలైన  ఏప్రిల్, మే, జూన్  నెలకు  ఎలాంటి పెనాల్టీ ఉండదు ఆ తర్వాత వచ్చే మూడు నెలలకు అనగా జూలై, ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో  ఒక్కొక్క నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ   చెల్లించవలసి ఉంటుంది. అదే విధంగా మిగతా ఆరు నెలల  అనగా  అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు ఎలాంటి పెనాల్టీ ఉండదు. మిగతా మూడు మసాలైన జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు నెలకు 2 శాతం చొప్పున  పెనాల్టీ వేస్తారు. ఒక వేళ సంవత్సరం పాటు ఆస్తిపన్ను చెల్లించనివారు 24 శాతం పెనాల్టీతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 
  ఈ నేపథ్యం లో జీహెచ్ఎంసీ పరిధిలో 17 లక్షల 34 వేల 411  కమర్షియల్, రెసిడెన్షియల్, మిక్సిడ్ గల భవనాల కలిగిన పన్ను చెల్లింపు దార్లు ఉన్నారు. అందులో  9 లక్షల 6 వేల 486 ప్రాపర్టీలకు ఇప్పటి వరకు సుమారు 887కోట్ల  అస్తి పన్ను చెల్లించారు. మిగిలిన వారు కూడా వెంటనే చెల్లించి 2 శాతం  పెనాల్టీ నుండి  మినహాయింపు పొందండి.  జిహెచ్ఎంసీ  పరిధిలో గల  కమర్షియల్ రోడ్లకు ఇరువైపులా  ఉన్న  భవనాలను సర్వే చేసేందుకు 340  సర్వే  టీమ్ లు   ఏర్పాటు చేశారు. వారు ఇంటింటికి వెళ్లి  మిక్సింగ్, కమర్షియల్ అనుమతి లేకుండా పై అంతస్తు భవానాలు ఉన్న పక్షంలో  మార్చుకునేందుకు స్వయంగా దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన  కల్పించారు. తద్వారా  49, 439 మంది స్వయంగా ట్యాక్స్ మదింపుకు  కోసం విన్నవించుకున్నారు. అలా వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఇంకా మదింపు కానీ,  తక్కువ అసెస్మెంట్ ఉన్న నిర్మాణాలను పరిశీలించి వాటికి  రూల్స్  ప్రకారంగా ట్యాక్స్ రివిజన్  చేసే పక్రీయా కొనసాగుతున్నది.