పటిష్టంగా బల్దియా ఈవిడిఎం

పటిష్టంగా బల్దియా ఈవిడిఎం

 

                     హైదరాబాద్ నగరంలో విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్ మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయ్యాలని ప్లాన్ చేస్తుంది జిహెచ్ఎంసి. ఇప్పటికే 600మంది వరకు ఉన్న ఈవిడిఎంలో మరో మూడు వందల  ఎక్స్ సర్వీస్ మెన్ లను నియమించుకోవాలని డిసైడ్ చేసింది స్టాండింగ్ కమీటి. మొదటి ధశలో 100మందిని నియమించేందుకు నిర్ణయించింది.  గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో  వచ్చే విపత్తులను అధికమించేందుకు బల్దియా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. దేశంలో మరెక్కడ లేనివిధంగా  గ్రేటర్ డిఆర్ఎప్ టీంలకు  అత్యాదునికి వ్యవస్థను సామాగ్రని అందుబాటులోకి తెచ్చారు. అంతే కాకుండా కోత్తవాహనాలను కోద్దిరోజుల క్రితం మంత్రి కేటిఆర్  ప్రారంభించారు. నగరంలో వర్షాకాంలో వచ్చిన వరదలసమయంలో...  అగ్ని ప్రమాదాల సమయంలోనూ...., ఎదైనా నిర్మాణాలు కూలిన సందర్బాలతోపాటు కోన్నాళ్ల క్రితం కాచిగుడా స్టేషన్ వద్ద రైలు ప్రమాదం వంటి అంశాల్లో సేవలు అందిస్తున్నారు.

                  ఎన్పోర్స్ విభాగం ద్వారా ప్లాస్టిక్ నియంత్రణ...., అగ్ని ప్రమాదాలు జరుగకుండా చూడటానికి ఫైర్ సెఫ్టి వింగ్  తో కలిపి ఈ విభాగం పనిచేస్తుంది. ఆసుపత్రులకు..., విద్యాలయాలకు..., షాపింగ్ కాంప్లేక్సులకు నోటిసులు ఇవ్వడంతోపాటు వాటన్నింటిని విజిట్ చేసి సరిదిద్దే కార్యక్రమాన్ని చెపడుతున్నారు.   అయితే ఇటివల డెబ్రిస్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయ్యం..., వాటిని తోలగిస్తున్న వాహనాలను సీజ్ చేయ్యడంతోపాటు...., సిటిలో నిర్మాణం చెపడుతూ రోడ్లపై వ్యర్థాలు వేస్తున్న వారిపై ఫైన్లు వేసే కోత్త కార్యక్రమాన్ని చెపట్టింది  ఎన్పోర్స్ మెంట్ విజిలేన్స్ మరియు  డిజాస్టర్ టీం.  దాంతో క్రమ శిక్షణ కల్గిన  సిబ్బందిపై ఫోకస్ చేసింది జిహెచ్ఎంసి.  ఎక్స్ సర్వీస్  పర్సన్స్ ను నియమించుకోవాలని నిర్ణయించారు. మొత్తం మూడు వందల మంది పర్ఫేక్ట్ శిక్షణ కల్గిన టీం ను సమకూర్చుకోవాలని నిర్ణయించిన అధికారులు. మొదటిదశలో 100మందిని నియమించేందుకు గ్రీన్ సిగ్నల్  ఇబ్బంది స్టాండింగ్ కమీటి. ఇప్పటికే జిహెచ్ఎంసి ఈవిడిఎం విభాగంలో పనిచేస్తున్న పోలిశాఖ ఉద్యోగులకు డిప్యూటేషన్ అలవేన్స్ ను ఇవ్వాలని నిర్ణయించింది స్టాండింగ్ కమీటి. అయితే నగరంలో ఉన్న ఆక్రమాలను  అరికట్టేందుకు ఫైన్లు వేయ్యడానికి ప్రత్యేక యంత్రంగాన్ని సిద్దం చేస్తున్నారు బల్దియా అదికారులు.