నిర్భయ దోషులకు శిక్ష అమలు

 

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు

ఎడేళ్లతరువాత శిక్ష..

నాబిడ్డకు న్యాయం జరిగింది. నిర్భయతల్లి.
 

           నిర్భయ దోషులకు ఎట్టకేలాలకు  శిక్షపడింది. డిల్లి తీహార్ జైళ్లో పవన్ గుప్తా,  అక్షయ్, ముకేశ్‌ సింగ్‌, వినయ్ శర్మలను   శుక్రవారం తెల్లవారుజామున ఉరి తీశారు.   ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఫస్ట్ టైం.    తలారి పవన్‌ జలాద్‌ వారిని ఉరితీశారు.   పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు.  ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. 

           నిర్భయపై ఆరు మంది సామూహిక అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్‌ 16 కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆత్యాచారం తరువాత ఆమెను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో పాటుగా  ఉన్న స్నేహితుడిపై  దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. ఈఘటనలో వినయ్‌ శర్మ, పవన్‌, రామ్‌సింగ్‌, అక్షయ్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు విచారణలో ఉండగా రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.  మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష అనుభవించిన తరువాత  అతడు విడుదలయ్యాడు.  

            ఇక ఎడు సంవత్సరాల తరువాత ఈ కెసులో శిక్షపడింది. ఈ శిక్షఫై స్పందించిన నిర్భయ తల్లి ఇప్పుడు నాబిడ్డకు న్యాయం జరిగిందన్నారు. నిర్భయ నిందితులకు ఉదిశిక్షపడటంతో మహళి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.