నాడెందుకు మద్దతివ్వలేదు: రాజేంద్రప్రసాద్

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ప్రత్యేక హోదాకు మద్దతిస్తానన్నకేసీఆర్.. నాడు అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా కేసీఆర్, హరీష్ రావు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారని గుర్తుచేశారు. పోలవరం నిర్మాణంపై అభ్యంతరం లేదని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరంపై కవిత వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీదే అధికారం అని, అధికారంలోకి వచ్చాక భద్రాచలాన్ని ఏపీలో కలిపే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. భద్రాచలాన్ని ఏపీలో కలపాలని సుప్రీం కోర్టుకు వెళ్తామని రాజేంద్రప్రసాద్ చెప్పారు.