నవంబర్ 27, 28 తేదీల్లో ఓటరు జాబితా సవరణ

         నవంబర్ 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ ప్రత్యేక  క్యాంపెయిన్
     

                   ఎలాంటి తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా కోసం ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ ప్రత్యేక  క్యాంపెయిన్  నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్.  ఈ సందర్భంగా ఓటరు జాబితాలో  నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి.. మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని   అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.

 
           జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు నూతన ఓటరుగా నమోదు  చేసుకోవాలన్నారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా కొరకు 2021 సంవత్సరపు ముసాయిదా ఓటరు జాబితాను  భారత ఎన్నికల సంఘం నవంబర్ 1వ తేదీన విడుదల చేసిన నేపథ్యం లో. అలాంటి జాబితాలో పేరు మార్పు, అడ్రస్ మార్పు తదితర మార్పులు, చేర్పులు ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా  చేసుకోవచ్చునన్నారు.

              పౌరులు తమ తమ   సమీప పోలింగ్ బూత్ లో విడుదల చేసిన ముసాయిదా  ఓటరు జాబితా తో పాటు   ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారి    అందుబాటులో ఉంటారు. ఆ సందర్భంలో ఓటరు జాబితాను పరిశీలన చేసుకొని వెనువెంటనే మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఇట్టి  అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
.
           నూతన ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు.  ఓటరు జాబితాలో పేరు తొలగింపుకు ఫారం-7,  తప్పుల సవరణకు ఫారం-8,  ఒకే నియోజక వర్గంలో మార్పుకు ఫారం-8A  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ,   జి ఏం హెచ్ సి   కమిషనర్  తెలిపారు.