నవంబర్ బ్యాంకు సెలవులు 8రోజులే..

                  నవంబర్ లో దాదాపు 17రోజుల పాటు  బ్యాంకులకు  సెలవులు ఉన్నాయంటూ సోషల్ మిడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో నిజం లేదంటున్నాయి బ్యాంకు వర్గాలు.  తెలుగు రాష్ట్రాల్లో దీపావళి.., కార్తిక పూర్ణిమ/గురునానక్ జయంతి  సందర్బంగా రెండు రోజులు  సెవలవులు ఉంటాయి.  ఇక బ్యాంకులకు  సాధారణంగా ఉండే శని ఆది వారాలు కలిపి 8 సెలవులు వస్తున్నాయి.  నవంబర్ 4, 7, 13, 14, 19, 21, 27, 28తేదిల్లో సెలవులు ఉన్నాయంటున్నారు. బ్యాంకు ఖాతాదారులు.. వినియోగ దారులు చూసి సెడ్యూల్ చేసుకోవడం మంచిది.