దేశంలో కోటి కరోనా కేసులు..

దేశంలో కోటి కరోనా కేసులు..

జనవరి 30న దేశంలోకి..

11నెలల్లో కోటి మార్క్  క్రాస్

             దేశంలో   మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి  క్రాస్ అయ్యింది.  ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన దేశంగా భారత్ నిలిచింది. వరల్డ్ లొ కోటి కరోనా వైరస్‌ కేసులను దాటిన రెండో దేశంగా ఇండియా‌ నిలిచింది.

               భారత్ దేశంలోకి మొట్ట మొదటి కేసు జనవరి 30న కేరళలో నమోదైంది.  దేశంలో రికవరీ రేటు అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 95.5లక్షల మంది కోలుకున్నాట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.  దేశంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1.45లక్షలకు చేరింంది.  అయితే దేశంలో రికవరీ రేటు 95.46శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45శాతంగా ఉంది. దేశంలో 16కోట్లకుపైగా కరోనా పరిక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.