తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల....
90 శాతం ఉత్తీర్ణత.....
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.