తెలంగాణలో 25,937 మంది క్వారెంటెయిన్

తెలంగాణలో 25,937 మంది క్వారెంటెయిన్

పాజిటివ్ కేసులు 70

ఒకరూ మృతి.. మరోకరూ డిశ్చార్జి..

 

                  తెలంగాణలో కరోనా క్వారెంటైన్ లో 25,937మంది ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 70మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒకరూ మృతి చెందగా మరోకరు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11మంది పాజిటివ్ కేసుల్లో నెగటివ్ వచ్చిందని వారిని మరోసారి టెస్ట్ చేసి విడుడల చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. అయితే  క్వారెంటైన్ లో ఉన్న వారికి కోత్తగా కరోనా రాకుండా ఉంటే ఎప్రిల్ 7వ తేది వరకు అందరిని ఇంటికి పంపిస్తామన్నారు ముఖ్యమంత్రి. పంటకోనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు భయపడవద్దని తెలిపారు.

                  రైతులు అందోళన చెందకుండా తమ పంటను అమ్ముకోవాలని సూచించారు, అందరికి కూపన్లు  ఇస్తామని అందుకు అనుగుణంగా రైతులు పంటలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

                 ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన నిర్మాణరంగ కార్మికులు ఇతరులకూడా బియ్యం ఇవ్వడంతోపాటు మనిషికి 500రూపాయలు పంపిణి చేస్తామన్నారు ముఖ్యమంది. తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కష్టసమయంలో రాజకీయాలకు తావులేకుండా ఉండాలని అందరం సమీష్టిగా కరోనాతో పోరాటాం చెయ్యాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి.