ఢిల్లీ ర్యాలీలో ప్రమాదం.....

ఢిల్లీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత....

 

      వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీలో రైతులు నిర్వ‌హించిన ట్రాక్ట‌ర్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారింది. ప‌లుచోట్ల బారీకేడ్ల‌ను తొల‌గించుకుని రైతులు న‌గ‌రంలోకి ప్ర‌వేశించారు. దాంతో సెంట్ర‌ల్ ఢిల్లీలోని ఐటీవో జంక్ష‌న్ ద‌గ్గ‌ర పోలీసులు వారిని అడ్డగించారు. ఈ సంద‌ర్భంగా పోలీసులకు, ఆందోళ‌న‌కారులకు మ‌ధ్య దాడులు, ప్ర‌తిదాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు రైతులు, పోలీసులు గాయ‌ప‌డ్డారు. 

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి రైతు మృతి....

     ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మ‌రిన్ని పోలీస్ బ‌ల‌గాలు సెంట్ర‌ల్ ఢిల్లీకి చేరుకుని రైతుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ సంద‌ర్భంగా స్పీడ్‌గా వెళ్తున్న ఓ ట్రాక్ట‌ర్ బారిగేట్ ని డీకొని బోల్తా పడటంతో రైతు మృతిచెందాడు. మృతిచెందిన రైతు ఉత్త‌రాఖండ్ రాష్ట్రం, బాజ్‌పూర్ జిల్లాకు చెందిన న‌వ‌నీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుడితోపాటు ఉన్న రైతులు మాత్రం పోలీసుల కాల్పుల్లోనే న‌వ‌నీత్ మృతిచెందాడ‌ని ఆరోపిస్తున్నారు. కాని పోలీసులు మాత్రం ట్రాక్టర్ వేగంగా వెల్లడం వల్లే ప్రమాదం జరిగిందని చెపుతున్నారు.