టోల్ ప్లాజా దాటాలంటే ఫాస్టాగ్ ఉండాలి..
టోల్ ప్లాజా దాటాలంటే ఫాస్టాగ్ ఉండాలి..
లేదంటే రెండింతలు చెల్లించాలి..!
జనవరి 1నుండి అమల్లోకి - కేంద్రం.
జనవరి ఒకటి నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలకు మాత్రమే టోల్‌ప్లాజాల వద్ద అనుమతి ఉంటుందని నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద నగదురహిత చెల్లింపులకు శ్రీకారం చుట్టేదిశగా ఈ కార్యక్రమాన్ని చెపట్టింది ప్రభుత్వం. మొదట జాతీయ రహదారులపై, తర్వాత రాష్ట్ర రహదారులపై ఇవిదానాన్ని అమలు చేయ్యనున్నట్లు తెలుస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఫాస్ట్ టాగ్ లేని వాహనం పోరపాటున టోల్ ప్లాజా వరుసలోకి వచ్చిన పక్షంలో రెండింతల మొత్తాన్ని వసూలు చేయ్యాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
2017 నుంచి ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం పలుమార్లు వెసులు బాటు కల్పించింది. గడిచిన ఎడాది నుండి ప్రతి టోల్ ప్లాజ్ లో రెండు మార్గాల్లో మాత్రమే నగదు చెల్లింపులకు అనుమతించింది. జనవరి ఒక్కటినుండి ఆ వరసల్లోకూడా ఫాస్ట్ టాగ్ ద్వారా చెల్లింపులు చేయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ టాగ్ అమ్మాకాలు.. రీచార్జీ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70శాతం వాహనాలకు మాత్రమే ఫాస్ట్ టాగ్ ఉన్నట్లు కేంద్ర ఉపరితల రవాణ మంత్రిత్వశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణాలో 75శాతం వాహనాలకు ఉన్నట్లు అంచానా.