టిఆర్ఎస్ - బిజేపి రైతులను మోసం చేస్తున్నాయి

టిఆర్ఎస్ - బిజేపి రైతులను మోసం చేస్తున్నాయి

          కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రైతులను మోసం చేస్తున్నారని ద్వజమెత్తారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటి అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి. రైతులు పండించిన పంటలు కోనుగోలు చేయ్యాలని వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెపట్టింది కాంగ్రేస్.  పబ్లీక్ గార్డెన్ నుండి కాంగ్రేస్ నేతలు ర్యాలీగా ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం వరకు వెళ్లారు. లోపలికి పోలిసులు అనుమతించకపోవడతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు కాంగ్రేస్ నేతలు. రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిఉండి కేసిఆర్ ఇందిరా పార్కు వద్ద దీక్షలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. నిజంగా రైతుల పక్షాన పోరాటం చేయ్యాలంటే రైతుల కళ్లాల వద్దకు వెల్లాలని సూచించారు.  లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు రేవంత్. బీజెపి నేతలు డిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదియాలని డిమాండ్ చేశారు.  ఈనెల 19 నుండి  23వ తేది వరు కళ్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో రైతుల పంటలు కోనుగోలు చేయ్యాలని ఉద్యమం చేస్తామన్నారు . రైతుల సమస్యలు పరిష్కరించకుంటే రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.