జిహెచ్ఎంసి నైట్ షల్టర్లు

               వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు, అత్యవసర చికిత్స కొరకు  హైదరాబద్ లో గల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం  రాష్ట్ర నలుమూలల నుండి వస్తారు.  చికిత్స కోసం రోగితో పాటుగా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు  ప్రభుత్వ  ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్లు నిర్మాణానికి  చర్యలు చేపట్టారు.  ఆర్థిక స్తోమత లేక హోటల్స్.., లాడ్జీలలో దిగలేని వారు బయట రోడ్ సైడ్స్ తలదాచుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కు  చికిత్స కోసం వచ్చిన వారికి  జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

             10.68 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  7 నైట్ షెల్టర్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ ఎన్ టి ఆసుపత్రిలో  2.90కోట్ల  వ్యయం తో చేపట్టారు ఉస్మానియ జనరల్  ఆసుపత్రి లో  3.37 కోట్లతో,  మహావీర్ ఆసుపత్రిలో 95 లక్షల వ్యయం తో, నిలోఫర్  ఆసుపత్రిలో 2.60కోట్ల తో , కోటి మెటర్నిటీ ఆసుపత్రి లో 1.96కోట్ల తో, నిమ్స్ ఆసుపత్రి లో 3.10 కోట్ల  నాంపల్లి ఏరియా ఆసుపత్రి 1కోటి  రూపాయల వ్యయంతో  నైట్ షెల్టర్ పనులు చేపట్టి  పూర్తి చేసి నిర్వహణ కోసం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి అప్పజెప్పడం జరిగింది. నైట్ షెల్టర్ల లో  వచ్చే పేషెంట్లకు వారి  సహాయకులు  కనీస అవసరాలు తీర్చుకునే విధంగా వసతులను కల్పించారు. 

 

                ఈ ఎన్ టి ఆసుపత్రిలో  మహిళలకు పురుషులకు కలిసి  మొత్తం108మందికి  వసతి కల్పిస్తారు.అదేవిధంగా  ఉస్మానియా జనరల్ ఆసుపత్రి లో 126మందికి,మహావీర్ లో 76మందికి  నిలోఫర్ లో 192మందికి, కోటి మెటర్నిటీ ఆసుపత్రి లో 160మందికి ,నిమ్స్ లో 115,నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో 100 మందికి మొత్తం  సుమారు 900మందికి షెల్టర్ లో అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసి యుసిడీ  విభాగం అధ్వర్యంలో  ఆయా సర్కిల్ మరో 14  నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా మంది పేదలు ఇక్కడ ఉచితంగా వసతి సదుపాయం కల్పించబడుతుంది.