జిహెచ్ఎంసికి సహాయం పంపిణి కష్టాలు..?

 

జిహెచ్ఎంసికి వరద సహాయం పంపిణి కష్టాలు..?

వరదంతా పోయాక లబ్దిదారుల గుర్తింపుఎలా..? 

అధికారులపై ప్రజలు తిరగబడటం ఖాయం..?

 

               గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు వరద సహాయం పంపిణి కష్టాలు తెచ్చిపేడుతుందా....? వరదబాదితులను గుర్తించి వారికి  ఇప్పుడు సహాయం అందిచండం అధికారులకు  తలనోప్పిగా మారనుందా...? వరద   తగ్గిపోయి నెల రోజులకు పైగా  అవుతున్న తరుణంలో వారి ఇబ్బందులు.., కష్టాలు.. నష్టాలు అధికారులు ఎలా అంచనా వేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయంగా అయ్యింది.

 

                          బల్దియా ఎన్నికల తరువాత వరద సహాయం అందజేస్తామన్నా ప్రభుత్వం  హామితో పెద్ద సంఖ్యలో బాధితులు తమకు వరద సహాయం అందించాలని విజ్నప్తి చేస్తున్నారు. 7వ తేది నుండి సహాయం అందించే కార్యక్రమం చేపడుతామని ముఖ్యమంత్రి తెలపడంతో ఉదయం నుండే వందలాది మంది  వరద భాదితులు మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరారు.   బల్దియా అధికారులు నేరుగా ఇళ్ల  వద్ద పరిశీలించి లబ్దిదారులను గుర్తించి సహాయాన్ని అందజేస్తారని కమీషనర్ ప్రకటించారు. దాంతో మీసేవాలనుండి బల్దియా కార్యాలయాలకు వచ్చారు బాదితులు. అయితేే  తమకు ఇంకా ఆదేశాలు రాలేదని వారిని తిప్పిపంపారు క్షేత్రస్థాయిలో ఉన్నా జిహెచ్ఎంసి అధికారులు. ఇంత వరకు అలా ఉంటే ఇప్పుడు వరద భాదితులను గుర్తించడం పెద్ద సవాలే అంటున్నాయి బల్దియా వర్గాలు.  వరద పూర్తిగా తగ్గి పోయి ఇళ్లన్నింటి శుభ్రం చేసుకోని సాదారణ స్థితిలో ఉన్నారు ప్రజలు ఇప్పుడు ఎవ్వరికి  వరద వచ్చింది వారు ఎంత నష్టపోయారు అన్న అంశంలను ఎలా లెక్క వేయ్యలన్న అంశంపై బల్దియా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. సాధారంగా వరదల సమయంలో అప్పటికప్పుడు క్షత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని  అంచనా వేసి అధికారులు ఇచ్చే నివేధిక ఆదారంగా  పరిహారం చెల్లించ బడుతుంది. అయితే ఇప్పటి కే ప్రభుత్వం ఆరున్నర లక్షల మందికి వరద సహయం అందొంచినట్లు లెక్కలు  చెబుతుంది.  ఇంటికి  అధికారులు తిరిగి నాలుగున్నర లక్షల మందికి సహయం అందజేయగా..., మరో రెండు లక్ష మంది ఇసేవాల్లో దరకాస్తు చేసుకున్నవారికి సహాయం అందింది.

  

                       గ్రేటర్లో ఇప్పటి వరకు ఆరున్నర లక్షల మంది సహాయం అందించినప్పటికి ఇంకా లక్షల్లో భాదితులు తమకు సహాయం అందలేదంటున్నారు. వారు మీసేవవాలకు  పెద్ద సంఖ్యలో తరలి   వస్తున్నారు. ఇలానే  పెద్ద సంఖ్యలో ఇంకా హైదారబాదీలు క్యూ కడితే ఎంటి పరిస్థితి అనేది ఇప్పుడు చర్చనీయ అంశం అయ్యింది. మరో వైపు ఇప్పటికే  లబ్దిదారుల ఎంపికలో లోపాలు జరిగాయంటున్నారు సిటిజన్స్. నిజమైన వదర బాధితులకు కాకుండా ఇతరులకు ఎక్కువగా సహాయం అందిందని ఆరోపిస్తున్నారు సిటిజన్స్. వరద సహాయం కుటుంబానికి మాత్రమే అందాల్సి ఉండగా కోన్ని చోట్ల కుటుంబంలోని చాలా మంది పేర్లతో  వరద సహాయం డబ్బలు తీసుకున్నట్లు పలు ప్రాంతాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక మీసేవా కేంద్రాల్లో కూడా గతంలో లబ్ది పోందిన వారి కుటుంబ సభ్యుల ఆదార్ కార్డు ఆదారంగా మరో సారి ధరకాస్తూ చేసుకోంటే వారికి కూడా 10వేలు బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యాయంటున్నారు.  నిజంగా నష్టపోయిన తమను మాత్రం ఇలా తిప్పుతున్నారని మండి పడుతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో బల్దియా అధికారులు ఇంటింటికి తిరిగి వరదల్లో నష్టాపోయిన వారిని ఇప్పుడు ఎలా గుర్తిస్తారనే ప్రశ్నర్థకంగా మారింది. గతంలో వరద వచ్చిన ప్రాంతాలన్నింటి వద్ద సాదారణ పరిస్థితులు నెలకోన్నాయి. అప్పటి ఇబ్బందులను నష్టాన్ని   ఎలా అంచానా వేయ్యాలనేది బల్దియా అదికారులకు ఇబ్బందిగా మారింది. మొత్తంగా వరద సహాయం ప్రోగ్రాం బల్దియా అధికారులకు తలనోప్పిగా మారింది ఇప్పుడు.