గ్రేటర్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

      జిహెచ్ఎంసిలో పేరుగుతున్న అక్రమ నిర్మాణాలు..

      క్షేత్రస్థాయిలో భారీ నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోని సిబ్బంది..  

                        బల్దియాలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయా.., అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆక్రమార్కులు అగడం లేదా.., చిన్న చిన్న నిర్మాణాలు జరిగితే టక్కున వాలిపోయే  అదికారులు.., ఎలాంటి అనుమతులు లేకుండా అంతస్తులకు అంతస్తులు నిర్మాణం సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. తాజాగా ఉప్పల్ లో జరుగుతున్న భారీ అక్రమ నిర్మాణం పై స్థానిక ఎంపీ చేసిన ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. టి ఎస్ బి పాస్ ద్వారా వేగంగా అనుమతులు ఇస్తామని అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నా..., ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సైతం జీహెచ్ఎంసీకి మొట్టికాయలు వేసింది.

 

                    గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించే ఇళ్ల‌కు అనుమ‌తులు జారీ చేస్తుంది. బ‌ల్దియా అనుమ‌తులు లేకుండా  ఎ ఒక్క‌రూ ఇంటిని నిర్మించ‌డానికి వీలులేదు. టౌన్ ప్లానింగ్ ను కాపాడ‌టానికి అవ‌స‌ర‌మైన ప‌ద్ద‌తుల్లో నిర్మాణ అనుమ‌తులు జారీ చేస్తుంది జిహెచ్ఎంసి. ఇచ్చిన అనుమ‌తుల‌కంటే ఎక్కువ ఫోర్లు నిర్మించినా..., ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండా ఇంటి నిర్మాణం చెప‌ట్టిన అది అక్ర‌మ నిర్మాణం అవుతుంది.  దాంతో 2015 అక్టోబ‌ర్ నుండి సిటిలో అక్ర‌మ నిర్మాణాల‌ను సహించే ప్రసక్తి లేదని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం. అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చెప‌ట్టాలని  బ‌ల్దియాను ఆదేశించింది. నిర్మాణ అనుమతుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు కోసం టి ఎస్ బి పాస్ అమలులోకి తీసుకు వచ్చి వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు వాటిని సరళతరం చేసింది. దీంతో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిర్మాణ అనుమతులు వేగంగా పొందడానికి పౌరులకు అవకాశం ఏర్పడింది. అదే సమయంలో అక్రమ నిర్మాణాలు జరిగితే మాత్రం ఉపేక్షించకుండా కూల్చివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

                      అయితే గ్రేట‌ర్ ప‌రిదిలో ఎక్క‌డ ప‌రిడితే అక్క‌డ  ఆక్ర‌మ‌నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకెోకుండా నిర్మాణాలు చేయ్యడం ఒక పద్దతైతే..., తీసుకున్న నిర్మాణ అనుమతులను వాయిలెట్ చేస్తూ సెట్ బ్యాక్ లు వదలకుండా నిర్మాణం చేయ్యడం..., ఎక్కువ అంతస్తూలు వేయ్యడం వంటి వాయిలెషన్స్ బల్దియాలో జరుగుతున్నాయి.  జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కోర‌త కార‌ణంగా వాటిని నియంత్రించ‌లేక‌పోతున్నామంటున్నారు అదికారులు.  మరోవైపు అధికారులపై కోన్ని సార్లు రాజకీయ నేతలు ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెచ్చి అక్రమ నిర్మాణాలు పెరిగేందుకు కారణం అవుతున్నారనే అరోపణలున్నాయి. దాంతో నగరంలో ఆక్రమ నిర్మానాలు పెరుగుతున్నాయి. సిటిలో ప్రతి నెల అక్రమంగా వస్తున్న నిర్మాణాలకు 100కుపైగా నోటిసులు ఇస్తున్నారు. అందులో కోంత మంద స్పందించి వాటిని సరిచేసుకోగా..., మరికోంత మంది కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకుంటున్నారు. అందులో 40 నుండి 50 నిర్మాణాల వరకు కూల్చి వేస్తున్నామంటున్నాయి బల్దియావర్గాలు.

 

                          గ్రేట‌ర్ ప‌రిదిలో జ‌రుగుతున్న అక్ర‌మ నిర్మాణాల‌పై ఉన్నతాదికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినప్పుడు..., కోర్టులు సిరియస్ అయినప్పుడు అక్రమ నిర్మాణాలపై పోకస్ చేస్తున్నారు అదికారులు. 2019లో ప్రత్యేక డ్రైవ్ ఎపట్టిన అధికారులు సిటిలో మొత్తం 467 భ‌వ‌నాలు ఎలాంటి అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న‌ట్లు గుర్తించి  వాటిని కూల్చీ వేశారు. 2020 జూన్ లో మరోసారి డ్రైవ్ చెపట్టి కూల్చి వేతలు చేశారు. ఒక్క అయ్యప్ప సోసైటి వద్దనే దాదాపు 100వరకు ఇల్లీగల్ నిర్మాణాలు కూల్చివేశామంటున్నాయి బల్దియా వర్గాలు. తర్వాత అడపదడప అక్కడక్కడ కూల్చివేతలు చేపట్టినా అవి పూర్తిస్థాయిలో సాగడం లేదు. దాంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు జిహెచ్ఎంసి లో వినిపిస్తున్నాయి. తాజాగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఓ భారీ నిర్మాణాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్నారంటూ స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ మంత్రికి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్యలు ఉంటాయా లేదా మీరు భాగస్వాములేనా అంటూ ఘాటుగా విమర్శించారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. గతంలో జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ ఆదేశించింది హైకోర్టు. నగరంలో అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి కి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తుంటాయి. ఇక  జీహెచ్ఎంసీకి  అందే ఫిర్యాదుల్లో 80శాతానికి పైగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన‌వే ఉంటున్నాయి. జీహెచ్ఎంసీ పై వివిధ న్యాయ‌స్థానాల్లో 5వేలకుపైగా కేసులు ఉండ‌గా వాటిలో దాదాపు 4వేల‌కు పైగా టౌన్‌ప్లానింగ్ కు చెందినవే ఉన్నాయంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్న‌లోపాల‌ను అంచ‌నా వేయ్య‌వ‌చ్చు. 

  

                    గ్రేటర్ హైరాబాద్ లో అత్యదికంగా శేరిలింగం పల్లి..., కుకట్ పల్లి జోన్లతోపాటు ఎల్బీనగర్ ప్రాంతాల్లో  అక్రమ నిర్మాణాలు ఎక్కువగా వస్తుంటాయి. శేరిలింగం పల్లి.., కుకట్ పల్లి జోన్ల పరిదిలో మరి ఎక్కువగా అక్రమ నిర్మాణాల దందా కోనసాతుందంన్న ఆరోపణలున్నాయి. కుకట్ పల్లి సిటి ప్లానర్.., శేరిలింగం పల్లి అసిస్టేంట్ సిటి ప్లానర్లపై అక్రమ నిర్మాణాలకు చెందిన విజిలెన్స్ ఎంక్వరీ జరుగుతుంది.  బల్దియాలో ఎసిబి పట్టుబడుతున్న వారిలో అదికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన వారే ఉంటున్నారు.  జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ నిర్మాణాలు నివారణ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వాటిని అడ్డుకోవడంలో విఫలం అవుతుంది జిహెచ్ఎంసి. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే క్షణాల్లో వాలిపోయే జిహెచ్ఎంసి సిబ్బంది భారీ నిర్మాణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ అంశం పై ఫోకస్ చేయకపోతే గ్రేటర్ పరిధిలో అక్రమా నిర్మాణాల సంఖ్య భారీగా పెరిగాయి పరిస్థితులు కనిపిస్తున్నాయి.