గ్రామ పంచాయితీల్లో కార్యాలయం కష్టాలు

గ్రామ పంచాయితీల్లో కార్యాలయం కరువు.. 

        తెలంగాణ రాష్ట్రంలో ని చాలా గ్రామ పంచాయితీల్లో భవనాలు లేక కార్యాలయాల నిర్వహణ కష్టంగా మారింది. పంచాయితీకి చెందిన సామగ్రి.., రికార్డులు భద్ద పరిచేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాియ. గతంలో ఉన్న 8,386పంచాయితీలు ఉండగా 2018లో 4383 పంచాయితీను ఎర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా జిల్లాల్లోని కోత్త పంచాయితీలతోపాటు అప్పటికే ఉన్న పంచాయితీలుకలిపి మొత్తం 6500వరకు పంచాయితీలకు భవనాలు లేవు. ఇక కోన్ని పంచాయితీల్లోని భవనాలు పాతబడి శిథిలావస్తకు చేరుకున్నాయి. దీంతో చాలా గ్రామ పంచాయితీల్లోని సర్పంచ్ లు అద్దెకు కార్యాలయాలు తీసుకోని కాలం వెళ్లదిస్తున్నారు.