గుజరాత్ లో కూలిన తీగల వంతెన....

   గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ వద్ద మచ్చు నది పై ఉన్న 140 ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో132 మంది చనిపోయారు చాలామందికి గాయాలయ్యాయి. బ్రిడ్జిపై 500 మంది వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరమ్మతులు చేసి పున ప్రారంభం చేసిన నాలుగు రోజుల్లోనే కూలిపోవడం గమనార్హం.. మొర్బి పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని బ్రిజేష్ మీర్జా వెల్లడించారు.

   ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, క్షతగాత్రులకు 50వేల  చొప్పున  ఆర్థిక సాయం ప్రకటించగా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.