క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం

           86.61 కోట్లతో క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం

 

       శారీరిక సామర్థ్యం నైపుణ్యాలను మెరుగుపరచడం...సాంప్రదాయక అటలతో పాటుగా ఆధునిక ఆటలలో ప్రావిణ్యం పొందేందుకు జిహెచ్ఎంసి ఎర్పాటు చేస్తుంది.   స్థానిక క్రీడాకారులకు అనువుగా ఉండే  విధంగా ఆయా ప్రాంతాల్లో  క్రిడా ప్రాంగాణలాను ఎర్పాటు చేస్తుంది.   పెద్దలకు.. పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తినీ  పెంపొందించేందుకు క్రీడా ప్రాంగణాలు,  స్విమ్మింగ్ పూల్స్ దోహద పడేందుకు జిహెచ్ఎంసి  కృషి చేస్తున్నది.  నగరంలో అవసరమైన చోట క్రీడా ప్రాంగణాలు, ఆడిటోరియంలు, ఇండోర్ స్టేడియంలు  ప్లే-గ్రౌండ్స్  నిర్మాణాలు చేపట్టారు. క్రీడా మైదానాలలో క్రీడాకారులకు ప్రయోజనాలు, ప్రజలకు వినోద భరత కార్యక్రమాలు, క్రీడల పట్ల ఆసక్తి   పెంపొందించే  మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని తెలిపింది జిహెచ్ఎంసి. అందుకోసం నగరంలో  86.61 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19 స్పోర్ట్ కాంప్లెక్స్ లు,  స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణాలను చేపట్టారు. అందులో  22.11 కోట్ల రూపాయల విలువైన  7పనులు పూర్తి చేశారు.  మిగతా పనులు ప్రగతి దశలలో ఉన్నాయి. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు.