కోవిడ్ మూడవ స్ట్రెయిన్ గుర్తింపు
కోవిడ్ మూడవ స్ట్రెయిన్ గుర్తించిన బ్రిటన్..
కోవిడ్ రెండో వేరియంట్‌తో ప్రపంచ భయపడుతుండగా థర్డ్ స్ట్రెయిన్ కూడా బ్రిటన్ లో వచ్చినట్లు చెబుతున్నారు అధికారులు. సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన వారిని పరీక్షించగా కరోనా వైరస్ న్యూ వేరియంట్ ను గుర్తించినట్లు బ్రిటన్ ప్రభుత్వం ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ చెప్పారు.
మొదట వైరస్ యొక్క కొత్త జన్యు మార్పును బ్రిటన్‌లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. యూకేలో మరో కొత్త వేరియంట్ కరోనావైరస్ యొక్క రెండు కేసులను గుర్తించాం అని మీడియా సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి హాంకాక్ చెప్పారు. రెండూ కేసులు కూడా గత కొన్ని వారాలక్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కేసుల్లో కనుగొన్నమని చెప్పారు. కోత్త వైరస్ 70 శాతం వరకు ఎక్కువ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.