కోవిడ్ చికిత్స ప్రభూత్వ ధరలకే....

    ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్‌ చికిత్సలు అందించాలని, నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను అధిక ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ప్రస్తుతం రోగుల వద్దకు పీపీఈ కిట్లు లేకుండా కేవలం మాస్క్‌లతోనే డాక్టర్లు వెళ్లగలుగుతున్నందున, వాటికి అదనంగా చార్జీలు వసూలు చేయొద్దని సూచించారు. కోవిడ్‌ రోగులకు బెడ్ల కేటాయింపు అంశంపై శనివారం మంత్రి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో వేర్వేరు గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్స, ఆసుపత్రుల్లో బెడ్‌ల చార్జీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి అంశాలు చర్చకు వచ్చాయి.