కొబ్బరి నీళ్లు తాగితే..

కూల్‌గా ఉందని కూల్ డ్రింక్ తాగితే కూల్‌గానే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాని బదులు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యం. ఎన్నో వ్యాధులకు మందులా పని చేసే కొబ్బరి నీళ్లు ప్రకృతి ప్రసాదించిన సంజీవిని. గుండెను భద్రంగా ఉంచుతుంది. బాడీలో హీట్‌ని తగ్గిస్తుంది. అందుకే కొబ్బరి బోండాన్ని సెలైన్‌తో సమానమని అభివర్ణిస్తుంటారు వైద్యులు. 
లేత కొబ్బరి బోండం నీటిలో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వందేళ్ల కిందటి వరకు డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవారట. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత ఏర్పడడంతో సెలైన్ కొరత ఏర్పడడంతో యుద్ధంలో గాయపడ్డవారికి కొబ్బరి నీటిని ఇచ్చి త్వరగా కోలుకోవడానికి కారణమయ్యారట. మాల్దీవుల జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందను సెప్టెంబర్ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు.