కృష్ణ భౌతికాయానికి సీఎం కేసీర్ ఘన నివాళి...
తెలుగు చలన చిత్ర సీమకు గౌరవాన్ని తీసుకువచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మరణం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అన్న కేసీఆర్.. ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను తాను ఎన్నోసార్లు చూశానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పానని అన్నారు. రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
అంతకుముందు.. నానక్ రామ్ గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. కృష్ణ భౌతికాయానికి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు. మహేష్ బాబుతో మాట్లాడి ఓదార్పు ఇచ్చారు. కాసేపు వారితో కూర్చుని ధైర్యం చెప్పారు. కృష్ణ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ అన్నారు.