కారు...! సారు....! తోమ్మిదే..

కారు సారు తోమ్మిదే..
కారు సారు ప‌ద‌హారు లేక్క త‌ప్పింది.
4బిజేపి.. 3  కాంగ్రేస్.. 1ఎంఐఎం.

               రాష్ట్రంలో టిఆర్ ఎస్ పార్టీ లెక్క త‌ప్పింది. ఎన్నిక‌ల్లో కోంద‌రూ నేత‌లు కారు సారు ప‌ద‌హారు అంటూ నిన‌దిస్తే... మ‌రికోంద‌రూ కారు.., సారు.., ప‌ద హారు కేంద్రంలో స‌ర్క‌ర్ అంటూ ప్ర‌క‌ట‌ణ‌లు చేశారు. అయితే హైద‌రాబాద్ సిటు త‌మ మిత్ర ప‌క్షం అయినా ఎంఐఎం.., మిగిలిన 16స్థానాలు త‌మ‌వే అంటూ ప్ర‌క‌ట‌ణ‌లు చేశారు టిఆర్ఎస్ పెద్ద‌లు. కోన్ని నియోజ‌క వ‌ర్గాల్లో కేవ‌లం మెజారీటికోసం మాత్రమే ప్ర‌చారం చేస్తున్నామ‌న్న‌ట్లుగా చెప్పుకోచ్చారు. అయితే ప‌రిస్థితి అందుకు బిన్నంగా మారింది. 17స్థానాల‌కు 9స్థానాల‌ను మాత్ర‌మే టిఆర్ఎస్  గెలుచుకుంది. ఒక స్థానం ఎంఐఎం గెలుచుకోగా..., బిజేపి నాలుగు స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఇక కాంగ్రేస్ 3స్థానాల్లో విజ‌యం  సాధించింది.

        అయితే ముఖ్యమంత్రి కేసిర్ కూతురు మాజీ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఈ ఎన్నిక‌ల్లో గోర ప‌రాభ‌వాన్ని చ‌వి చూసింది. నిజామా భాద్ స్థానం నుండి బిజేపి అభ్య‌ర్థి చేతుల్లో 70వేల కు పైచిలుకు ఒట్ల‌తో ఒట‌మిపాల‌య్యింది. ప‌సుపు బోర్డు సాధించి మ‌ద్ద‌తూ ధ‌ర క‌ల్పిస్తాన‌ని.., లేకుంటే ఒట్లు అడ‌గ‌న‌ని గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామిని క‌విత నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో 185మంది రైతులు పోటిలో నిలిచి త‌మ నిర‌స‌న తెలిపారు. ఈ అంశం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయ అంశం అయ్యింది. అయితే క‌విత ఒటమే ల‌క్ష్యంగా  రైతులు  ప్ర‌చారం సాగించారు. అంతే కాకుండా ముఖ్య‌మంత్రి అత్యంత స‌న్నిహితుడు మాజీ ఎంపి బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ కూడా బిజేపి నేత బండి సంజ‌య్ కుమార్ చెతిలో ఒట‌మి పాలయ్యారు. అయితే చివ‌ర్లో మ‌రి కోంత‌మందిని నేరుగా టిఆర్ఎస్ ఎన్నిక‌ల్లో దించ‌డం కూడా టిఆర్ఎస్ ఒట‌మికి కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు రాజ‌కీయ ప్ర‌ముఖులు.  ఎదిఎమైనా టిఆర్ఎస్ పెట్టుకున్న టార్గెట్ మాత్రం ఈ ఎన్నిక‌ల్లో  నెర‌వేర లేదు.