కారుపై చేయి విజం. 

కారుపై చేయి విజం. 
మ‌ల్కాజ్ గిరి, భువ‌న‌గిరి, న‌ల్గోండ‌ల్లో కాంగ్రేస్ జోరు.
రేవంత్ కు కోత్త ఉత్సాహం.

                  తెలంగాణ లో మూడు స్థానాల‌ను కాంగ్రేస్ కైవ‌సం చేసుకుంది. అన్ని సీట్లు త‌మవేనంటూ టిఆర్ఎస్ నేత‌లు చెప్పిన మాట‌ల‌కు చెక్ పెట్టింది కాంగ్రేస్.  అంతే కాదు మ‌రో 4స్థానాల‌ను   బిజేపి త‌మ అకౌంట్ లో వేసుకుంది. టిఆర్ఎస్ కు ఊహించిన షాక్ ఇచ్చింది కాంగ్రేస్. అయితే టిఆర్ఎస్ నేత‌ల అంచ‌నాల‌ను తారుమారు చేస్తు కాంగ్రేస్ నేత రెవంత్ రెడ్డి విజ‌యం సాధించ‌డం టిఆర్ఎస్ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ‌టంలేదు. ప్ర‌తి  విష‌యంలో పార్టీని ప్ర‌భుత్వాన్ని పాయింట్ అవుట్ చేస్తున్న రేవంత్ ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్న టిఆర్ఎస్ శ్రేణులు..., పార్ల‌మెంట్ కు వెళ్ల‌కుండా అడ్డుకోలేక‌పోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విజ‌యం  కాంగ్రేస్ వ‌ర్గాల్లో ఉత్సాహ‌న్ని నింపుతుంది.  కోడంగల్ లో చెల్లిన రూపాయి మ‌ల్కాజ్ గిరిలో చెల్లుతుందా అని టిఆర్ఎస్ నేత‌లు వేసిన ప్ర‌శ్న‌కు మ‌ల్కాజ్ గిరి ప్ర‌జ‌లు చెల్తుతుంద‌నే స‌మాదానం ఇచ్చారు. ఇక న‌ల్గోండ పార్ల‌మెంట్ కు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.., భూవ‌న గిరి పార్ల‌మెంట్ కు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డిలు ఎన్నిక అయ్యారు. అయితే చివ‌రి వ‌ర‌కు లీడ్ లో ఉన్న చెవేళ్ల కాంగ్రేస్ అభ్య‌ర్థి కోండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి చివ‌ర్లో వెన‌క‌బ‌డి ఒట‌మిపాల‌య్యారు.