కారుకు లిఫ్ట్ ఇచ్చిన లెప్ట్

           తెలంగాణలో కారుకు లెఫ్ట్ పార్టీలు లిఫ్ట్ ఇచ్చాయి. మునుగోడు ఎన్నికల్లో కమ్యునిస్టు పార్టీల ఒట్లు కీలకంగా మారాయి.  నల్లగోండ జిల్లాలో చాలా పట్టు ఉంది కమ్యునిస్టులకు మునుగోడులో సైతం ఐదు సార్లు లెఫ్ట్ పార్టీలు విజయం సాధికంచాయి. గ్రామాల్లో సిపిఐ సిపియం పార్టీలకు ఇప్పటికి సాంప్రదాయ ఒటింగ్ ఉంది. పార్టీ పిలుపు నిస్తే చాలు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు తమ పార్టీ శ్రేణులు ఒటింగ్ చేయిస్తాయి. అది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి భాగా కలిసి వచ్చింది. 

              రాష్ట్రంలో జరుగుతున్న ఉపఎన్నికల్లో  వరుసగా అపజయాలను ముటగట్టుకుంటున్న అధికార టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో మాత్రం గెలుపును అందించాయి లెఫ్ట్ పార్టీలు. కాంగ్రెస్ నుండి గెలిచిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామ చేసి బిజేపిలో చేరడంతో.. ఆ పార్టీని ఒడించడమే టార్గెట్ గా కమ్యూనిస్ట్ పార్టీలు టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. ఈ నియోజక వర్గంలో 15 నుండి 20వేల వరకు ఒట్లు కాంగ్రేస్ కు ఉన్నాయి. తాము టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పడమే  కాకుండా క్షేత్రస్థాయిలో ఒటు చేయించేలా ఆయా పార్టీల కార్యకర్తలు చోరవ తీసుకున్నారు. దాంతో ఇప్పుడు కారు గట్టేక్కడానికి ప్రదాన కారణం కమ్యునిస్టులే అంటన్నారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజా గోపొల్ రెడ్డి. ఇక తాము ఎంత ప్రయత్నం చేసినా కమ్యునిస్టు పార్టీలు తమకు మద్దతు ఇవ్వకుంటే మాత్రం గెలుపు సాద్యమయ్యేది కాదంటున్నారు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు.